ETV Bharat / sports

అభిమానుల మధ్య కివీస్​-ఆసీస్​ చివరి టీ20 - న్యూజిలాండ్​ మ్యాచ్​కు ప్రేక్షకులకు అనుమతి

స్వదేశంలో ఆసీస్​తో జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్​కు ప్రేక్షకులను అనుమతించనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వెల్లింగ్టన్​లో కొవిడ్​ నిబంధనలు తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Crowds allowed for double-header in New Zealand
న్యూజిలాండ్​తో​ చివరి టీ20కి ప్రేక్షకులకు అనుమతి
author img

By

Published : Mar 6, 2021, 5:41 AM IST

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్​ మధ్య జరగనున్న చివరి టీ20 మ్యాచ్​కు ప్రేక్షకులను అనుమతించనున్నారు. వెల్లింగ్టన్​ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్​ మహిళా జట్ల మధ్య జరగాల్సిన టీ20 సిరీస్​కూ అభిమానులను అనుమతించనున్నట్లు కివీస్ బోర్డు ప్రకటించింది.

కొవిడ్ దృష్ట్యా న్యూజిలాండ్ ప్రభుత్వం​ లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో.. ప్రేక్షకులను అనుమతించబోమని తొలుత కివీస్ క్రికెట్​ బోర్టు ప్రకటించింది. ఇప్పుడు కరోనా​ నిబంధనల తొలగింపుతో అనుమతిస్తోంది.

న్యూజిలాండ్​లో జరుగుతున్న 5 మ్యాచ్​ల టీ20 సిరీస్​లో 2-2తో ఆస్ట్రేలియా, కివీస్​ సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్​ ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు ఇంగ్లాండ్​ మహిళల జట్టు 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి:సెహ్వాగ్​ 35 బంతుల్లో 80- ఇండియా లెజెండ్స్​ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.