క్రికెటర్లు కరోనాతో కలిసి సాగాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని, అయితే వైరస్ కారణంగా ఆట ఏమంతగా మారిపోదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.
"క్రికెటర్లతో పాటు అందరూ వైరస్‌తో కలిసి జీవించాల్సిందే. ఓ ప్రమాదకర వైరస్ మన చుట్టూ ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని ఆటగాళ్లు తమ జీవనాన్ని కొనసాగించడం అలవాటుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆటలో నిబంధనలు, పద్ధతులు పెద్దగా మారతాయని నేననుకోను. బంతికి ఉమ్ము రాయడానికి బదులు ప్రత్యామ్నాయం రావచ్చు. భౌతిక దూరంతో పాటు చాలా నిబంధనలను క్రీడల్లో పాటించడం అంత సులభం కాదు. కాస్తో కూస్తో క్రికెట్లోనే ఇవి సాధ్యం. ఫుట్‌బాల్, హాకీ లాంటి క్రీడల్లో ఆ నిబంధనలెలా పాటిస్తారు?" - గంభీర్, మాజీ ఆటగాడు
ఇదీ చూడండి.. ఒక్క గోల్.. రాత్రికి రాత్రే అతడ్ని హీరోను చేసింది!