అప్పటివరకు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి, వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుని, స్టన్నింగ్ క్యాచులతో అదరగొట్టిన క్రికెటర్లు.. అకస్మాత్తుగా క్రికెట్‌కు వీడ్కోలు పలికారంటే ఏ అభిమానికి మాత్రం బాధలేకుండా ఉంటుంది. తమ అభిమాన ఆటగాడు మైదానంలో దుమ్మురేపుతున్నప్పుడు వచ్చే ఆనందం, కేరింతలు, ఈలలు అన్ని మూగబోతాయి. మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించడమంటే ఓ ఆటగాడికి తన జీవితంలోనే అతి పెద్ద సవాల్ లాంటిది. అయినా ప్రతి ఏడాది ఎవరో ఒక క్రికెటర్ ఆటకు గుడ్‌బై చెప్తూనే ఉంటారు. అలానే ఈ ఏడాది కూడా చాలా మంది గొప్ప ఆటగాళ్లు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మరి వారెవరో ఓసారి చూద్దాం.
ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో విజయవంతమైన సారథుల్లో ఒకడు. తన కెప్టెన్సీలో మూడు ప్రపంచకప్‌ల్లోనూ భారత్‌ను విజేతగా నిలిపాడు. ఎప్పుడూ ప్రశాంత స్వభావంతో మెలిగే మహీ.. తన రిటైర్మెంట్ను కూడా ఆగస్టు 15వ తేదీన చాలా సింపుల్‌గా ఓ చిన్న సందేశం ద్వారా తెలిపి అందరినీ షాక్‌కు గురిచేశాడు. మొత్తంగా కెరీర్లో 350 వన్డేలు(10,073 పరుగులు), 90టెస్టులు(4876 పరుగులు), 98టీ20(1617 పరుగులు) ఆడాడు.
సురేశ్ రైనా
సురేశ్ రైనా కూడా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే ఆటకు వీడ్కోలు పలికాడు. కెరీర్లో 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడి.. 7988 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతున్నాడు.
ఇర్ఫాన్ పఠాన్
కెరీర్లో ఎన్నో గాయాలు, నిలకడలేమి, టీమ్ మేనేజ్మెంట్ నుంచి ప్రోత్సాహం కరవు ఇలా ఎన్నో సమస్యల నడుమ అర్ధాంతరంగా తన కెరీర్‌ను ఈ ఏడాది ముగించాడు ఇర్ఫాన్ పఠాన్. గంగూలీ, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం తన అదృష్టమని చెప్పాడు. కెరీర్లో 29 టెస్టులు(100 వికెట్లు), 120వన్డేలు(173 వికెట్లు), 24టీ20(28 వికెట్లు)ఆడాడు. టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
ఇయాన్ బెల్
ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ బెల్.. కెరీర్లో 118టెస్టులు(7727 పరుగులు), 161 వన్డేలు(5416పరుగులు) ఆడాడు. ఏడు యాషెస్ సిరీస్‌లో పాల్గొన్న ఇతడు ఐదు యాషెస్ సిరీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. "జరగాల్సిన సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. దురదృష్టమేంటంటే ఇది నా సమయం. నేనెప్పుడు ఆటను ప్రేమిస్తూనే ఉంటా. ప్రస్తుతం నా శరీరం నేను ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతుంది. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా" అని వీడ్కోలు పలికేటప్పడు ఈ మాట చెప్పాడు ఇయాన్.
మహ్మద్ ఆమిర్
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్.. 28ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. పాకిస్థాన్ బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆటకు వీడ్కోలు పలికాడు. కెరీర్లో 36 టెస్టులు, 61 వన్డేలు, 50టీ20 ఆడగా.. 259 వికెట్లు పడగొట్టాడు ఆమిర్.
శామ్యూల్
వెస్టిండీస్ క్రికెటర్ మార్లన్ శామ్యూల్.. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. చివరిసారిగా 2018 డిసెంబరులో విండీస్ తరఫున ఆడాడు. కెరీర్లో 71 టెస్టులు, 207వన్డేలు, 67 టీ20లు ఆడగా.. 11, 134పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు ఉండగా.. 152 వికెట్లు తీశాడు.
వసీం జాఫర్
రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ వసీం జాఫర్.. ఈ ఏడాది మార్చిలో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. కెరీర్లో 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. "రిటైర్మెంట్ ప్రకటించడానికి సరైన సమయం వచ్చింది. నా కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లో ఎర్రబంతి ఫార్మాట్‌ను ఎంతగానో ప్రేమించా. కోచ్ లేదా కామెంటేటర్‌గా నా రెండో ఇన్నింగ్స్ ప్రారంభిద్దామనుకుంటున్నా" అని జాఫర్ అన్నాడు.
పార్థివ్ పటేల్
17 ఏళ్ల వయసులో 2002 జనవరి 4న న్యూజిలాండ్‌పై వన్డేతో పార్థివ్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. 2012 ఫిబ్రవరి 21న ఇంగ్లాండ్ వన్డే చివరగా ఆడాడు. 2002 ఆగస్టు 8న తొలి టెస్టు, 2018 జనవరి 24న చివరి టెస్టులో పాల్గొన్నాడు. భారత్ తరఫున రెండు అంతర్జాతీయ టీ20లు, గుజరాత్ తరఫున 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. పదేళ్ల కెరీర్లో 38 వన్డేలు, 25 టెస్టులాడి వరుసగా 736, 934 పరుగులు చేశాడు. ఇందులో 10 అర్ధశతకాలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు పార్థివ్.
ఓజా
2008లో అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ఓజా.. 2013 వరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 24 టెస్టులు, 18 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్టులో 113 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో హైదరాబాద్‌కు, ఐపీఎల్లో దక్కన్ ఛార్జర్స్, ముంబయి ఇండియన్స్‌కు ఆడాడు. 2018లో బిహార్ తరఫున చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
షేన్ వాట్సన్
2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాట్సన్.. కెరీర్లో 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20లు ఆడి.. మొత్తంగా 14 వేల పరుగులు చేశాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మొత్తంగా 145 మ్యాచులు ఆడాడు. వాట్సన్. 2008, 2018లో ట్రోఫీని సొంతం చేసుకున్న రాయల్స్, చెన్నై జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2008, 2013లో మ్యాన్ ఆఫ్ ది టోర్న్‌మెంట్ అవార్డును అందుకున్నాడు. మొత్తంగా లీగ్ చరిత్రలో 137.91 స్ట్రైక్ రేట్‌తో 3,874 పరుగులు చేశాడు.
2020: క్రికెట్‌ను వీడినా.. అభిమానుల మదిని దోచారు
ఇదీ చూడండి : 2020 రౌండప్: లోకాన్ని విడిచి.. మదిలో నిలిచి!