టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడటంటే నవ్వులే నవ్వులు. మైదానంలో తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేస్తాడు. ఇక మైక్ అందుకున్నాడటే గిలిగింతలు పెట్టే మాటలతో కవ్విస్తుంటాడు. సోషల్ మీడియాలోనూ సరదా చిత్రాలు, వీడియోలు పెట్టి ఆకట్టుకుంటాడు. వీటికి తోడుగా ఈ మధ్యనే టిక్‌టాక్‌లో వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ఆ మధ్య శ్రేయస్ అయ్యర్‌తో కలిసి డాన్స్ చేశాడు.
తాజాగా అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ, ఎడమచేతి వాటం పేసర్ ఖలీల్ అహ్మద్‌తో కలిసి టిక్‌టాక్ చేశాడు. పిక్కగాయంతో హిట్‌మ్యాన్ ఐదో టీ20 తర్వాత పర్యటన నుంచి వెనుదిరిగాడు. టీ20, వన్డే సిరీస్‌లు పూర్తయిన తర్వాత చాహల్ స్వదేశానికి వచ్చేశాడు. ఎక్కడో తెలియదు గానీ హిందీ చిత్రం 'ధోల్'లోని ఓ హాస్య సన్నివేశాన్ని ఈ త్రయం అనుకరించింది. కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ పాత్రను చాహల్.. తుషార్, కునాల్ పాత్రలను రోహిత్, ఖలీల్ పోషించారు.
ఇందులో చొక్కాను చాహల్ వెనకనుంచి కాకుండా ముందు నుంచి వేసుకున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నాడని భావించిన ఖలీల్ అతడిని కాపాడేందుకు కొడుతుంటాడు. సాయం చేయమని రోహిత్‌ను కోరగా అతడూ తన చేతికి పనిచెబుతాడు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. వన్డే సిరీస్ ఆడుతుండగా శ్రేయస్ అయ్యర్‌ను వెనకనుంచి హత్తుకున్న చాహల్.. 'పట్టేసుకున్నా' అనే వ్యాఖ్యను జోడించి ఆ చిత్రాన్ని ట్వీట్ చేశాడు. దీన్ని హిట్‌మ్యాన్ ట్రోల్ చేయడం సహా సోషల్ మీడియాలో తర్వాత నీతో కలిసున్న చిత్రమే పెడతానని అన్నాడు.
-
We are back 😂😂 @ImRo45 @imK_Ahmed13 pic.twitter.com/THo3qiD7Qt
— Yuzvendra Chahal (@yuzi_chahal) February 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are back 😂😂 @ImRo45 @imK_Ahmed13 pic.twitter.com/THo3qiD7Qt
— Yuzvendra Chahal (@yuzi_chahal) February 25, 2020We are back 😂😂 @ImRo45 @imK_Ahmed13 pic.twitter.com/THo3qiD7Qt
— Yuzvendra Chahal (@yuzi_chahal) February 25, 2020
ఇదీ చూడండి : శిఖరం నుంచి పాతాళానికి: టెన్నిస్‌కు షరపోవా గుడ్‌బై