ETV Bharat / sports

రైనా బంధువులపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు - RAINA IPL CSK

క్రికెటర్ సురేశ్ రైనా బంధువుల కుటుంబంపై గతనెలలో జరిగిన దాడి కేసులో అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు సభ్యుల్ని పోలీసులు అరెస్టు చేశారని ముఖమంత్రి అమరీందర్ సింగ్ వెల్లడించారు. మరో 11 మంది కోసం గాలిస్తున్నట్లు డీజీ దినకర్ తెలిపారు.

'Cricketer Suresh Raina's kin related case solved'
సురేశ్ రైనా
author img

By

Published : Sep 16, 2020, 2:16 PM IST

Updated : Sep 16, 2020, 2:21 PM IST

భారత మాజీ క్రికెటర్​ సురేశ్ రైనా బంధువు హత్య కేసులో పంజాబ్​ పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. వారి నుంచి బంగారు ఉంగరం, గొలుసు, రూ.1530, రెండు స్టిక్స్​ స్వాధీనం చేసుకున్నట్లు డీజీ తెలిపారు. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారిని సావన్, ముహబ్బత్, షారుక్​ ఖాన్​గా గుర్తించారు. వీరంతా రాజస్థాన్​లోని జుంజూకు చెందిన వారని పేర్కొన్నారు.

ఆగస్టు 19 రాత్రి పంజాబ్​ పఠాన్​కోట్​కు చెందిన కాంట్రాక్టర్ అశోక్​ కుమార్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇందులో అశోక్ అక్కడికక్కడే మరణించారు. మిగిలన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే సురేశ్ రైనా, ఐపీఎల్ ప్రాక్టీసు మధ్యలోనే వదిలేసి, తన బంధువుల కుటుంబానికి అండగా నిలిచేందుకు స్వదేశానికి తిరిగొచ్చాడు. ఈ దాడి దారుణమైనదని పేర్కొంటూ, విచారణ చేయమని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్​కు విజ్ఞప్తి చేశాడు. స్వయంగా ఆయనే దీనిపై దృష్టిసారింది విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఇతర వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

amarinder singh
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్

Last Updated : Sep 16, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.