మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూలపై రహానెసేన పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హనుమవిహారి స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమానితో తెలుగులో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
విహారిని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. 'తొందరగా ఔట్ చేయండి' అని అన్నాడు. దీంతో విహారి అభిమానుల వైపు నడుస్తూ.. 'ఔట్ చేస్తే మ్యాచ్ అయిపోతుందిగా' అని బదులిచ్చాడు. ఆసీస్ ఆలౌటైతే, ఆ తర్వాత భారత్ ఛేదనకు దిగి సులువుగా విజయం సాధిస్తుందని, దీంతో మ్యాచ్ తొందరగా ముగుస్తుందనే ఉద్దేశంతో విహారి ఇలా సరదాగా అభిమానితో చెప్పాడు. ఏ ప్రేక్షకుడైనా మ్యాచ్ తొందరగా ముగిసిపోవాలని ఆశించడు కదా! కాగా, కాకినాడకు చెందిన విహారి తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. ఎక్కువసేపు క్రీజులో లేకపోయినా ఉన్నంతసేపు దీటుగా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.
-
#hanumavihari Anna...😜😜😝
— Always PSPK (@tagore_official) December 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Proud of you Anna.... Love you@Hanumavihari pic.twitter.com/K7CkHCRAHG
">#hanumavihari Anna...😜😜😝
— Always PSPK (@tagore_official) December 29, 2020
Proud of you Anna.... Love you@Hanumavihari pic.twitter.com/K7CkHCRAHG#hanumavihari Anna...😜😜😝
— Always PSPK (@tagore_official) December 29, 2020
Proud of you Anna.... Love you@Hanumavihari pic.twitter.com/K7CkHCRAHG
మరోవైపు, 133/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 200 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో ఆసీస్ ఆధిక్యాన్ని సమం చేసింది. జనవరి 7న సిడ్నీ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: దిగ్గజ మురళీధరన్ రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్