మరికొన్ని రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకాబోతోంది. అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కొన్ని జట్లు అనుభవానికి పెద్ద పీట వేస్తే.. మరికొన్ని జట్లు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చాయి. మంచి ప్రదర్శన కనబర్చినా మెగాటోర్నీలో అవకాశం దక్కని ఆటగాళ్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. 'మిస్సింగ్ ఎలెవన్' అంటూ మరో జట్టును ప్రకటించింది. వారిపై ఓ లుక్కేద్దాం...
మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్)
పాకిస్థాన్ సారథి సర్ఫరాజ్ గైర్హాజరుతో జట్టులోకి వచ్చిన ఆటగాడు రిజ్వాన్. కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా మంచి ప్రదర్శనే కనబర్చాడు. 26 ఏళ్ల ఈ క్రికెటర్ 32 వన్డేల్లో 33.57 సగటుతో 700 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి ఆకట్టుకున్నాడు.
నిరోషాన్ డిక్వెల్లా (శ్రీలంక)
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో పరాజయం పాలైన శ్రీలంకకు ప్రస్తుతం అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చాలా అవసరం. చాలా మంది ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వారిలో నిరోషాన్ డిక్వెల్లా ఉండడం ఆశ్చర్యకరమే. గత ఏడాదిగా ఈ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ 15 ఇన్నింగ్స్‌ల్లో 497 పరుగులు సాధించాడు.
రిషభ్ పంత్ (భారత్)
బ్యాకప్ వికెట్ కీపర్ విషయంలో భారత్ అనుభవానికే ఓటేసింది. పంత్‌కు అవకాశం ఇస్తారని అంతా భావించగా.. తుదిజట్టులో మాత్రం దినేష్ కార్తీక్‌కు అవకాశం కల్పించారు సెలెక్టర్లు. 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్‌కు మరిన్ని అవకాశాలు కల్పించాలని భావిస్తోంది యాజమాన్యం. కేవలం 5 వన్డేలు ఆడిన ఈ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్... బౌలర్లపై విరుచుపడే సామర్థ్యం ఉన్న ఆటగాడు.
-
Congratulations to @RishabPant777, the ICC Men’s Emerging Cricketer of the Year 2018! 🇮🇳
— ICC (@ICC) January 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
He became the first Indian wicket-keeper to score a Test century in England, and equalled the record for the most catches taken in a Test, with 11 in Adelaide in December.#ICCAwards 🏆 pic.twitter.com/s5yQBuwWlv
">Congratulations to @RishabPant777, the ICC Men’s Emerging Cricketer of the Year 2018! 🇮🇳
— ICC (@ICC) January 22, 2019
He became the first Indian wicket-keeper to score a Test century in England, and equalled the record for the most catches taken in a Test, with 11 in Adelaide in December.#ICCAwards 🏆 pic.twitter.com/s5yQBuwWlvCongratulations to @RishabPant777, the ICC Men’s Emerging Cricketer of the Year 2018! 🇮🇳
— ICC (@ICC) January 22, 2019
He became the first Indian wicket-keeper to score a Test century in England, and equalled the record for the most catches taken in a Test, with 11 in Adelaide in December.#ICCAwards 🏆 pic.twitter.com/s5yQBuwWlv
అంబటి రాయుడు (భారత్)
ఏడు నెలల క్రితం వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాయుడుకు మద్దతుగా నిలిచాడు సారథి విరాట్ కోహ్లీ. నాలుగో స్థానానికి రాయుడు సరిగా సరిపోతాడని వ్యాఖ్యానించాడు. కానీ విజయ్ శంకర్ రాకతో ఈ తెలుగు క్రికెటర్‌కు నిరాశే ఎదురైంది. త్రీ డైమెన్షన్ ఉన్న ఆటగాడంటూ శంకర్‌కు అవకాశం కల్పించారు సెలెక్టర్లు. రెండేళ్ల విరామం తర్వాత సెప్టెంబర్ 2018లో పునరాగమనం చేసిన రాయుడు అద్భుతంగా రాణించాడు.
దినేశ్ చండీమల్ (శ్రీలంక)
శ్రీలంక జట్టుకు సారథిగా వ్యవహరించిన చండీమల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోవడం ఆశ్చర్యకరమే. 2010లో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు లంక జట్టులో విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకుని కెప్టెన్‌గా ఎదిగాడు. 2018లో 42.57 సగటుతో మంచి ప్రదర్శన కనబర్చాడు. 146 వన్డేలాడిన చండీమల్‌ను పక్కనపెట్టడం సాహసమనే చెప్పాలి.
జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్)
ఇప్పటివరకు జాతీయ జట్టుకు ఆడనప్పటికీ ఆర్చర్ పేరు కొన్ని నెలలుగా వినబడుతోంది. టీ20 లీగ్‌లో సత్తాచాటడం ద్వారా ఇంగ్లండ్ జట్టులో స్థానం ఆశించాడీ బౌలర్. పొట్టి ఫార్మాట్లో యార్కర్లతో పరుగులను కట్టడి చేయడంలో దిట్ట.
-
Jofra Archer has not been named in England's provisional 15-man squad for #CWC19.
— ICC (@ICC) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
He has, however, been included in England's squads to face Ireland and Pakistan in May.
FULL STORY ⬇️https://t.co/jqm1j5BJI0 pic.twitter.com/BXV5x44gPT
">Jofra Archer has not been named in England's provisional 15-man squad for #CWC19.
— ICC (@ICC) April 17, 2019
He has, however, been included in England's squads to face Ireland and Pakistan in May.
FULL STORY ⬇️https://t.co/jqm1j5BJI0 pic.twitter.com/BXV5x44gPTJofra Archer has not been named in England's provisional 15-man squad for #CWC19.
— ICC (@ICC) April 17, 2019
He has, however, been included in England's squads to face Ireland and Pakistan in May.
FULL STORY ⬇️https://t.co/jqm1j5BJI0 pic.twitter.com/BXV5x44gPT
అసిఫ్ అలీ (పాకిస్థాన్)
పాకిస్థాన్ జట్టులో భారీ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆటగాడు అలీ. 27 ఏళ్ల ఈ ఆటగాడికి మేలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో చోటు లభించింది. ఇందులో మంచి ప్రదర్శన కనబరిస్తే ప్రపంచకప్ జట్టుకు అర్హత సాధించే అవకాశం ఉంది.
పొలార్డ్ (వెస్టిండీస్)
2016లో చివరిసారిగా వన్డే ఆడాడు పొలార్డ్. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటుతున్న ఈ ఆటగాడికి తుదిజట్టులో చోటు లభిస్తుందని అంతా అనుకున్నారు. 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 200 పరుగులు చేసి ఆకట్టుకున్నాడీ భారీ హిట్టర్. సారథిగా ఓ మ్యాచ్‌లో చెలరేగి ఆడి ముంబయి ఇండియన్స్‌కు విజయాన్ని అందించాడు. పొలార్డ్ కేవలం బ్యాట్స్‌మన్ కాకుండా మంచి బౌలర్, అద్భుత ఫీల్డర్ కూడా.
పీటర్ హ్యాండ్స్కోంబ్ (ఆస్ట్రేలియా)
స్టీవ్ స్మిత్ పునరాగమనంతో హ్యాండ్స్కోంబ్కు మొండిచేయి చూపించారు సెలెక్టర్లు. 2019లో 13 వన్డేలు ఆడిన ఈ ఆటగాడు 43.54 సగటుతో 479 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో మూడు అర్ధశతకాలు, ఓ శతకం ఉంది. బ్యాకప్ వికెట్ కీపర్ లేకుండా బరిలోకి దిగుతుంది ఆసిస్.
-
What if Carey goes down in warm-ups or in the middle of a game? Ian Healy is worried about Australia's lack of a back-up wicket-keeper.
— ICC (@ICC) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
READ ⬇️https://t.co/EFL2GVA2gC
">What if Carey goes down in warm-ups or in the middle of a game? Ian Healy is worried about Australia's lack of a back-up wicket-keeper.
— ICC (@ICC) April 17, 2019
READ ⬇️https://t.co/EFL2GVA2gCWhat if Carey goes down in warm-ups or in the middle of a game? Ian Healy is worried about Australia's lack of a back-up wicket-keeper.
— ICC (@ICC) April 17, 2019
READ ⬇️https://t.co/EFL2GVA2gC
అఖిల ధనుంజయ (శ్రీలంక)
శ్రీలంక జట్టులో మరో ఆశ్చర్యకర నిర్ణయం... అఖిల ధనుంజయకు చోటు లభించకపోవడం. గత 15 ఇన్నింగ్స్‌ల్లో 28 వికెట్లతో లంక జట్టు తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అనుమానాస్పద శైలి బౌలింగ్‌తో కొన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉన్నా.. పునరాగమనంలో మళ్లీ సత్తా చాటాడు.
మహ్మద్ ఆమిర్ (పాకిస్థాన్)
2017 ఛాంపియన్ ట్రోఫీలో పాక్ జట్టుకు విజయాన్నందించాడు ఆమిర్. అనంతరం ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. చివరగా ఆడిన 14 వన్డేల్లో 9 మ్యాచ్‌ల్లో వికెట్లేమీ తీయలేదు. అసిఫ్ అలీతో పాటు ఆమిర్ కూడా ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యాడు. అందులో మంచి ప్రదర్శన కనబరిస్తే మెగాటోర్నీ తుదిజట్టులో స్థానం సంపాదించే అవకాశం లేకపోలేదు.
ఇవీ చూడండి.. మహిళల ఐపీఎల్‌కు సర్వం సిద్ధం