ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఎంపికైన ముగ్గురు వెస్టిండీస్ క్రికెటర్లు డారెన్ బ్రావో, హెట్మయిర్, కీమో పాల్.. ఇప్పుడు పర్యటనకు వెళ్లేందుకు నిరాకరించారు. తాజాగా జట్టును ప్రకటించిన బోర్డు.. ఈ విషయాన్ని వెల్లడించింది.
షెడ్యూల్లో భాగంగా జులై 8 నుంచి ప్రేక్షకులు లేకుండానే ఇంగ్లాండ్‌లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. లాక్డౌన్ తర్వాత నిర్వహించనున్న క్రికెట్ మ్యాచ్‌లు ఇవే కావడం విశేషం. ఈ వారం కొవిడ్-19 పరీక్షలు జరిపిన తర్వాత, ఈనెల 8న ఇంగ్లాండ్‌కు ప్రయాణించనున్నారు విండీస్ క్రికెటర్లు.
వెస్టిండీస్ జట్టు: జేసన్ హోల్డర్(కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్, క్రుమా బోనర్, క్రెయిగ్ బ్రాత్‌వైట్, షమ్రా బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ ఛేజ్, రకీమ్ కార్న్‌వాల్, షేన్ డౌరిచ్, చెమర్ హోల్డర్, షై హోప్, అల్జారీ జోసెఫ్, రేమన్ రైఫర్, కీమర్ రోచ్