టీమిండియా ఆటగాళ్లపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు జల్లు కురిపించాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారని అన్నాడు. ఫిట్‌నెస్ లేకపోతే ఏ ఫార్మాట్‌లోనూ రాణించేలేరని తెలిపాడు.
"గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం భారత ఆటగాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారు. గతంలో ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. కానీ టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత క్రికెట్ ఫిటెనెస్‌తో కూడిన ఆటగా మారింది. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు టీ20 ఫార్మాట్ లేదు. అప్పట్లో క్రికెట్ అంటే ఫిట్‌నెస్ కంటే సాంకేతికమైన ఆటగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు ఫిట్‌నెస్ లేనిది ఏ ఫార్మాట్‌లోనూ ఎవరూ రాణించలేరు."
- గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్
భారత మహిళా జట్టు గొప్పగా ఆడుతోందని, ఇది దేశానికి శుభసూచకమని గంభీర్ అన్నాడు.
"క్రీడల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరిగితే భారత్‌ను క్రీడాదేశంగా మార్చాలన్న లక్ష్యం నెరవేరుతుంది. క్రికెట్‌కు పురుషులు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, మహిళలు కూడా అలాగే భావించాలి. ప్రస్తుత భారత మహిళా జట్టు గొప్పగా ఆడుతోంది. ప్రపంచకప్‌లో వారు సెమీఫైనల్స్‌కు చేరారు. అంతకుముందు రన్నరప్‌గా నిలిచారు. ఇది దేశానికి శుభసూచకం."
- గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్
2017 వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు రన్నరప్‌గా నిలవగా, 2018 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 21 నుంచి మహిళా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్×ఆసీస్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది.
ఇదీ చదవండి: శతకంతో ఆదుకున్న విహారీ.. భారత్ 263 ఆలౌట్