లైంగిక వేధింపుల ఆరోపణలతో టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ అతుల్ బెదాడే సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం అతడు బరోడా మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గతనెలలో హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన టోర్నమెంట్లో భాగంగా జట్టు సభ్యులను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతుల్‌ను కోచ్ పదవి నుంచి తప్పించింది బరోడా క్రికెట్ ఆసోసియేషన్.
"అతుల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిగే వరకు అతడు సస్పెండ్‌లో ఉంటాడు. బయటి వ్యక్తితో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తాం."- అజిత్ లేలే, బీసీఏ సెక్రటరీ
టీమ్ఇండియా తరపున అతుల్ బెదాడే 13 అంతర్జాతీయ వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 22.57 సగటుతో 158 పరుగులు చేశాడు. గతంలో బరోడా పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించి.. గతేడాది నుంచి బరోడా మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా మారాడు.
ఇదీ చూడండి.. 'సచిన్‌ను డకౌట్ చేయడమే నాకు కలిసొచ్చింది'