ప్రస్తుతం జీవించి ఉన్న మాజీ రంజీ ఆటగాళ్లలో పెద్ద వయస్కుడైన వసంత్ రైజీని క్రికెట్ దిగ్గజం సచిన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవా వా కలిశారు. 99 ఏళ్ల వసంత్‌ను కలిసేందుకు సచిన్, స్టీవ్ దక్షిణ ముంబయిలోని అయన ఇంటికి వెళ్లారు.
త్వరలో సెంచరీ..
ఈ నెల 26న సెంచరీ(వయసు) కొట్టనున్నారు వసంత్. అప్పటి బాంబే జింఖానా మైదానంలో టీమిండియా స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్ (1933) ఆడినప్పుడు అయన వయసు 13 ఏళ్లు. 1940ల్లో తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 277 పరుగులు చేశారు. ఇందులో 68 వ్యక్తిగత అత్యధికం.
క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత వసంత్ రచయితగా స్థిరపడ్డారు. దాదాపు ఇప్పటివరకు 10 పుస్తకాలు రాశారు. 'ద రొమాన్స్ ఆఫ్ ద రంజీ ట్రోఫీ', 'ఇండియా హంబుల్డన్ మ్యాన్' వంటి పుస్తకాలు మంచి పేరు తెచ్చాయి.