ETV Bharat / sports

క్రికెటర్ల కోసం మానసిక వైద్య నిపుణుల నియామకం!

ఆటగాళ్ల కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మానసిక వైద్య నిపుణులను నియమించాలని నిర్ణయించింది. గతేడాది కొంతమంది క్రికెటర్లు మానసిక ఒత్తిడి కారణంగా క్రికెట్​ నుంచి విరామం తీసుకున్నారు. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని బోర్డు ప్రకటించింది.

Cricket Australia to appoint 'mental health and wellbeing' expert
క్రికెటర్ల కోసం మానసిక వైద్య నిపుణుల నియామకం
author img

By

Published : Jul 15, 2020, 5:17 AM IST

ఆటగాళ్లు ఒత్తిడిని జయించేందుకు ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు (సీఏ) మానసిక వైద్య నిపుణులను నియమించేందుకు సిద్ధమైంది. గతేడాది ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​తో సహా ముగ్గురు ఆటగాళ్లు ఒత్తిడితో క్రికెట్​కు కొంత కాలం దూరమయ్యారు. ఈ నేపథ్యంలో సీఏ నిపుణుల నియామకంపై నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గతవారమే ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆటగాళ్లు, కోచ్​లు, సిబ్బందికి.. మద్దతు, మంచి వాతావరణాన్ని అందించడమే ప్రధాన లక్ష్యమని బోర్డు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం బోర్డులో ఆటగాళ్ల కోసం ఇద్దరు సైకాలజిస్టులు ఉన్నారు. వారిలో మైకేల్​ లాయిడ్​ పురుషుల జట్టు కోసం సేవలందిస్తుండగా.. పీటర్​ క్లార్క్​ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గతేడాది.. మ్యాక్స్​వెల్​ వ్యక్తిగత సమస్యల కారణంగా క్రికెట్​ నుంచి కొంతకాలం విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాట్స్​మన్​ నిక్​ మాడిసన్​, విల్​ పుకోవ్​స్కీ కూడా ఈ బాటలోనే వెళ్లారు. ఈ క్రమంలోనే క్రికెటర్ల మానసిక సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ చర్చల అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు నిపుణుల నియామకానికి ఆమోదముద్ర వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.