ETV Bharat / sports

ఆసీస్​ పర్యటన యథాతథం.. అడిలైడ్​లోనే గులాబీ టెస్టు

ఆస్ట్రేలియా, భారత్​ మధ్య ఈ ఏడాది చివర్లో జరగనున్న బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ షెడ్యూల్​ను బుధవారం విడుదల చేసింది క్రికెట్​ ఆస్ట్రేలియా. నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​.. డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకు జరగనుంది.

author img

By

Published : May 28, 2020, 7:58 AM IST

Updated : May 28, 2020, 8:06 AM IST

Cricket Australia set to announce schedule for India series; Adelaide to hold day-night Test in December
ఆసీస్​, భారత్​ టెస్టు సిరీస్​ షెడ్యూల్​ విడుదల

ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా పర్యటనపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. టెస్టు సిరీస్‌ యథాతథంగా జరుగుతుందని ప్రకటించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరులో టీమ్‌ఇండియా కంగారు గడ్డ మీద అడుగుపెడుతుంది. డిసెంబరు 3 నుంచి 7 వరకు బ్రిస్బేన్‌లో తొలి టెస్టు జరుగుతుంది. 1988 నుంచి ఇప్పటివరకు గబ్బా స్టేడియంలో ఆతిథ్య జట్టుకు ఓటమే లేదు.

డిసెంబరు 11 నుంచి 15 వరకు అడిలైడ్‌లో రెండో మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఇది డేనైట్‌ టెస్టు. టీమ్‌ఇండియా, ఆసీస్‌ల మధ్య తొలి గులాబి బంతి మ్యాచ్‌ ఇదే. డిసెంబరు 26 నుంచి 30 మెల్‌బోర్న్‌లో బాక్సింగ్‌ డే టెస్టు.. జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో నాలుగో మ్యాచ్‌ జరుగుతాయి. 2018-19లో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టీమ్‌ఇండియా తొలిసారిగా ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గి 71 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.

ఇదీ చూడండి... నేడే ఐసీసీ సమావేశం.. టీ20 ప్రపంచకప్​పై తుది నిర్ణయం

Last Updated : May 28, 2020, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.