లాక్డౌన్ కారణంగా తన జుట్టును తానే స్వయంగా కత్తిరించుకున్న చిత్రాలను సచిన్ పోస్ట్ చేసిన తర్వాత.. భారత లెజండరీ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ తన సరికొత్త లుక్ తాలూకా ఫొటోలను ట్విట్టర్లో ఉంచారు. అందులో గుండుతో, కళ్లద్దాలు, నల్ల కోటు వేసుకుని తాను ఎప్పుడూ కనిపించని రూపంలో దర్శనమిచ్చారు.
ప్రపంచమంతా కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో మానవాళి మనుగడ కోసం ప్రజలంతా సహకరించాలని కపిల్ ప్రజలను కోరారు. లాక్‌డౌన్‌కు సహకరిస్తూ అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఈ వైరస్ నియంత్రణకు పౌరులంతా మమేకమై ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలను పాటించి.. సురక్షితంగా ఉండాలని విన్నవించారు.
సచిన్ ఇటీవల తన జుట్టును తానే కత్తిరించుకున్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అది ఎలా ఉందో చెప్పాలని అభిమానులను అడిగారు. "స్క్వేర్ కట్స్ ఆడటం నుంచి నా హెయిర్ కట్స్ వరకు చేస్తున్నా. భిన్నంగా చేసే ప్రతిదాన్ని ఆస్వాదిస్తున్నా. నా కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది?" అని పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి.. కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది: సచిన్