ETV Bharat / sports

పాకిస్థాన్​ సూపర్ ​లీగ్​ ఆగిపోవడానికి ఆ మెసేజ్​​ కారణం!

ఇంగ్లాండ్​ క్రికెటర్​ అలెక్స్ హేల్స్​ అర్ధరాత్రి చేసిన మెసేజ్​పై పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్​ జట్టు యజమాని సల్మాన్​ ఇక్బాల్​ తాజాగా స్పందించాడు. అలెక్స్​కు కరోనా లక్షణాలున్నాయని ఆ మెసేజ్​ ద్వారా సమాచారమిచ్చాడని వివరించాడు​. ఈ పరిణామంతో టోర్నీని వాయిదా వేశామని తెలిపాడు.

Covid-19: 'Boss, I've symptoms of COVID-19'.. How Alex Hales' 2 AM call led to suspension of PSL 2020
పాకిస్థాన్​ సూపర్​లీగ్​ ఆగిపోవటానికి అలెక్స్​ మెసేజ్​ కారణం!
author img

By

Published : Apr 17, 2020, 2:09 PM IST

కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్​లో జరిగే సూపర్​లీగ్​నూ వాయిదా వేశారు. ఈ లీగ్ ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్​ ఆటగాడు అలెక్స్​ హేల్స్​ చేసిన మెసేజ్​తో ఆ దేశ క్రికెట్​ బోర్డు భయాందోళనకు గురైందట. ఈ విషయాన్ని ఆ జట్టు యజమాని సల్మాన్ ఇక్బాల్ తెలిపాడు.

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభం కారణంగా పాకిస్థాన్​ సూపర్​లీగ్-2020 వాయిదా వేశారు. అందులో పాల్గొనడానికి పాక్​ వెళ్లిన ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ తిరిగి స్వదేశానికి రావాలనే పిలుపుతో ఇంగ్లాండ్​ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఓ మెసేజ్​ రూపంలో "బాస్​.. నాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి" అని రాత్రి 2 గంటలకు కరాచీ కింగ్స్ యజమాని సల్మాన్​కు సమాచారం అందించాడు. ఈ విషయాన్ని సల్మాన్ ఇక్బాల్ తాజాగా వెల్లడించాడు.

"అలెక్స్​ సమాచారం తెలుసుకున్న తర్వాత అతడి వద్దకు వైద్యుడ్ని పంపించడానికి ప్రయత్నించా. కానీ కుదరలేదు" అని సల్మాన్​ ఇక్బాల్​ అన్నాడు. దీంతో అలెక్స్​తో మెలిగిన సహచరులంతా కరోనా పరీక్ష చేయించుకున్నారు. అందులో నెగిటివ్​ రావటం వల్ల పాక్ క్రికెట్ బోర్డుతో సహా.. క్రికెటర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామంతో పాకిస్థాన్​ సూపర్​లీగ్​ను తర్వాత రోజే వాయిదా వేశామని సల్మాన్​ తెలిపాడు.

ఇదీ చూడండి.. భారత్‌ ఆడనందుకు.. పాక్‌కు రూ.691 కోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.