క్రికెట్లో ఎల్లప్పుడూ నిలకడగా రాణించడమే తన రహస్యమని అంటోంది భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. వ్యక్తిగత రికార్డులను కాకుండా.. ప్రపంచకప్లో జట్టును విజేతగా నిలపాలనే మైలురాయిని చేరుకోవాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకొంది మిథాలి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది.
"చాలాకాలంగా ఆడుతూ ఉంటే ఇలాంటి మైలురాళ్లను చేరుకోవచ్చు. నిలకడగా రాణించడమే నా ఆట రహస్యం. బ్యాటింగ్కు వెళ్లినప్పుడల్లా.. వీలైనన్నీ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాను. ఇది దేశవాళీ టోర్నీలైనా.. అంతర్జాతీయ క్రికెట్లోనైనా! నాకు బ్యాటింగ్ ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి నేను చేసిన పరుగులే నా ఆటలో అనుభవాన్ని ఇచ్చాయి".
- మిథాలీ రాజ్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్
"మహిళా క్రికెట్ స్థాయి పెరుగుతోంది. 150 పరుగుల నుంచి 250 రన్స్ చేసే స్థాయికి వచ్చాం. ఆట మారే కొద్ది మనం మారాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా కెరీర్లో మైలురాళ్లను చేరుకోవడం కంటే.. టీమ్ఇండియాకు ప్రపంచకప్ అందిచాలనుకున్న మైలురాయిని చేరుకోవాలని ఉంది. ఒకవేళ కప్పు సాధిస్తే నా కెరీర్లో అది ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది" అని మిథాలీ రాజ్ చెప్పింది.
ఇదీ చూడండి: రికార్డ్ అలర్ట్: మిథాలీ పది వేల పరుగులు