ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ప్రస్తుతం జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న పాల్ కాలింగ్‌వుడ్ మైదానంలో ఆటగాడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్లు గాయాల బారిన పడటం వల్ల అతడు ఆడాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో ప్రపంచకప్ జెర్సీ ధరించి కనిపించాడు కాలింగ్‌వుడ్. ఈ మ్యాచ్‌కు జో రూట్ విశ్రాంతి తీసుకున్నాడు. గాయం కారణంగా కెప్టెన్ మోర్గాన్ ఆడలేదు. భుజం నొప్పితో స్పిన్నర్ రషీద్ అందుబాటులో లేడు. ఇంతమంది గైర్హాజరుతో తప్పని పరిస్థితుల్లో కాలింగ్‌వుడ్ ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్లు గాాయాల బారిన పడటం ఆ జట్టు మేనేజ్మెంట్ను కలవరపరిచే అంశమే.
ఇంగ్లాండ్ తరఫున 197 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడాడు కాలింగ్‌వుడ్. 5 వేల పరుగులతో పాటు 111 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 11 టెస్టులు, 36 టీ20ల్లోనూ పాల్గొన్నాడు. 2010లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకు సారథిగా ఉన్నాడు.
ఇది చదవండి: పాక్ ఆటగాళ్ల ఆనందానికి భారత్ అడ్డు..!