వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ తన బ్యాట్‌తో.. ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేయడమే తెలుసు. కానీ తనదైన శైలిలో హిందీ డైలాగులు చెబితే ఎలా ఉంటుందో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్‌తో కలిసి గేల్ ఒక సరదా వీడియోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ హిందీ డైలాగ్ చెప్పి నవ్వులు పూయించాడు.
ఆ వీడియోలో యువీ.. గేల్ వెనుక ఉండి డైలాగ్‌ను అందివ్వడం కనిపించింది. అయితే గేల్ చాలా హాస్యాస్పదంగా ఆ మాటలు చెప్పాడు. " నా ఆత్మవిశ్వాసంతో నీ చావుకు సమాధి కడతా" అనే అర్థం వచ్చేలా విండీస్ క్రికెటర్ పేర్కొన్నాడు. యూనివర్స్ బాస్ పలికిన సంభాషణకు నవ్వు ఆపుకోలేకపోయాడు యువీ. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన యువరాజ్.. డైలాగ్‌తో పాటు "కాకా భలే చెప్పావ్" అంటూ సందేశమూ జోడించాడు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
- View this post on Instagram
Confidence meraaaa ! Kabar banegi teri !! Well said kaka 🤣🤣🤣 @chrisgayle333
">
గేల్.. ఈసారి ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగనున్నాడు. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన 13వ సీజన్.. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడింది.