40 ఏళ్లు.. క్రికెట్లో ఈ వయసు వచ్చేటప్పటికి అందరూ ఆటకు వీడ్కోలు పలికేస్తారు. వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ మాత్రం బ్యాట్‌తో ఇంకా అదరగొడుతున్నాడు. ప్రపంచంలోని వివిధ లీగ్‌ల్లో ఆడుతూ పలు రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఇప్పటికే టీ20ల్లో చాలా ఘనతలు ఇతడి పేరుమీదే ఉన్నాయి.
గతంలో రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ వెనక్కు తీసుకున్న గేల్... ప్రస్తుతం టీ20ల్లో 22 శతకాలు చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఓ వైబ్‌సైట్ పోస్ట్ చేయగా, '10 మోర్ టూ కమ్'(ఇంకో పది చేస్తాను) అని రీట్వీట్ చేశాడు. అంటే మరో పది సెంచరీలు చేసిన తర్వాతే రిటైర్మెంట్ తీసుకుంటానని స్పష్టం చేశాడు.
-
10 more to come!! https://t.co/EkvopFig20
— Chris Gayle (@henrygayle) March 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">10 more to come!! https://t.co/EkvopFig20
— Chris Gayle (@henrygayle) March 15, 202010 more to come!! https://t.co/EkvopFig20
— Chris Gayle (@henrygayle) March 15, 2020
టీ20ల్లో ఇప్పటివరకు 13,296 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు గేల్. ఇందులో 22 సెంచరీలతో పాటు 82 అర్ధసెంచరీలు ఉన్నాయి. విండీస్ తరఫున టీ20ల్లో 2 సెంచరీలతో సహా 13 హాఫ్ సెంచరీలు చేశాడు. ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్లో పంజాబ్‌కు ఆడనున్నాడు.