ETV Bharat / sports

'చెన్నై టెస్టు పెద్ద గుణపాఠం నేర్పింది' - Chennai Test in 2016 jos buttler

టీమ్​ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్​లో పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని అన్నాడు ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ జోస్​ బట్లర్​. లేదంటే అంచనాలు తారుమరయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు. నాలుగేళ్ల క్రితం చిదంబరం స్టేడియంలో భారత్​తో తాము ఆడిన చివరి టెస్టు ఓటమి నుంచి పెద్ద గణపాఠం నేర్చుకున్నామని తెలిపాడు.

jos
జాస్​
author img

By

Published : Feb 1, 2021, 4:02 PM IST

Updated : Feb 1, 2021, 4:48 PM IST

చెన్నై ఎంఏ చిదంబరం మైదానం వేదికగా 2016లో ఇంగ్లాండ్​ చివరగా టెస్టు మ్యాచ్​ ఆడింది. అయితే ఈ మ్యాచ్​ ఓటమి తమ జట్టుకు పెద్ద గుణపాఠం నేర్పిందని అన్నాడు ఇంగ్లాండ్​ ​వికెట్​కీపర్​ జోస్​ బట్లర్. ఫిబ్రవరి 5న ప్రారంభంకానున్న ఇంగ్లాండ్​-భారత్​ టెస్టు సిరీస్​లో భాగంగా తొలి రెండు టెస్టులు అదే స్టేడియంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బట్లర్ ఈ విధంగా మాడ్లాడాడు​.

"చెన్నైలో నాలుగేళ్ల క్రితం ఆడాం. అప్పుడు తొలి ఇన్నింగ్స్​లో మేము 470కుపైగా పరుగులు చేశాం. అయితే కరణ్​ నాయర్​(303*) ఇన్నింగ్స్​ తోడవ్వడం వల్ల టీమ్​ఇండియా 700కు పైగా పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్​ మాకు చాలా పెద్ద గుణపాఠం నేర్పింది. ఇంగ్లాండ్​ పిచ్​లపై తొలి ఇన్నింగ్స్​లో సగటున 300-350స్కోరు చేయొచ్చు. అదే భారత్​లో వికెట్లను కాపాడుకుంటే తొలి రెండు రోజుల్లో 600-650 పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బంతి బాగా స్పిన్​ అయితే అంతకంటే కాస్త తక్కువ స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి బ్యాట్స్​మెన్​ పరిస్థితులను అర్థంచేసుకుని ఆడాలి. అప్పుడే భారీ స్కోరు చేయగలం."

-జోస్​ బట్లర్​, ఇంగ్లాండ్​ వికెట్​ కీపర్​.

2016లో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్​ను 75 పరుగులు తేడాతో ఓడించింది భారత్​. ఈ మ్యాచ్​లోని తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 477 పరుగులు చేయగా.. కరుణ్​ ఇన్నింగ్స్​(303*)తో టీమ్​ఇండియా కెరీర్​లోనే అత్యధిక స్కోరు(759/7పరుగులు) నమోదు చేసింది.

karan
కరణ్​ నాయర్​

ఇదీ చూడండి : బైబై2020: ఈ ఏడాది అత్యధిక టెస్టు పరుగులు వీరివే!

Last Updated : Feb 1, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.