ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యంత ప్రజాదరణ పొందిన, విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో మూడు సార్లు విజేతగా నిలిచింది.
సామాజిక మాధ్యమాల్లోనూ అభిమానులు ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీ, జట్టు విషయాలను తెలుసుకొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇటీవలే ఓ అభిమాని ట్విటర్లో అడిగిన ప్రశ్నకు సీఎస్‌కే సమయస్ఫూర్తితో ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది.
"సీఎస్‌కే జట్టులో ఏమైనా మార్పులున్నాయా?" అని ఓ అభిమాని ట్విటర్లో ప్రశ్నించాడు. అందుకు స్పందించిన చెన్నై యాజమాన్యం.. "అవును, డాడీస్ ఆర్మీ వయసు మరో ఏడాది పెరిగింది" అని చమత్కరించింది.
-
Yes. The Daddies Army will be a year older. 💛
— Chennai Super Kings (@ChennaiIPL) November 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yes. The Daddies Army will be a year older. 💛
— Chennai Super Kings (@ChennaiIPL) November 7, 2019Yes. The Daddies Army will be a year older. 💛
— Chennai Super Kings (@ChennaiIPL) November 7, 2019
రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో జరిగిన వేలంలో తన పాత ఆటగాళ్లనే ఎక్కువగా తీసుకుంది చెన్నై. అందువల్ల జట్టు సగటు వయసు 30 దాటింది.
ఆ సమయంలో చెన్నైను "డాడీస్ ఆర్మీ" అని కొందరు ఎగతాళి చేశారు. వేగంగా పరిణామాలు మారే టీ20ల్లో వారేం చురుగ్గా ఆడతారని వెటకారం చేశారు. కానీ వీటన్నింటినీ ఎదుర్కొని ధోనీసేన 2018లో కప్పు కొట్టింది. అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఈ ఏడాది రన్నరప్‌గా నిలిచింది.