ETV Bharat / sports

చెన్నై సూపర్​కింగ్స్​ ప్రాక్టీస్​ రద్దు.. సందిగ్ధంలో ధోనీ కెరీర్​? - Chennai Super Kings latest news 2020

ఐపీఎల్​ వాయిదా, కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రాక్టీస్​ మ్యాచ్​లకు సెలవు ప్రకటించింది చెన్నె సూపర్​కింగ్స్​. రెండు వారాలు ఈ సెషన్​ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్​ టోర్నీ కూడా ఏప్రిల్​ 15కు వాయిదా పడింది. అయితే ఒకవేళ ఈ టోర్నీ పూర్తిగా రద్దయితే ధోనీ భవిష్యత్​ ఏంటన్నది సందిగ్ధంలో పడింది.

Chennai Super Kings suspend practice sessions due to Corona outbreak, Dhoni Career under Question mark!
చెన్నై సూపర్​కింగ్స్​ ప్రాక్టీస్​ రద్దు.. ధోనీ భవిష్యత్​పై నీలినీడలు?
author img

By

Published : Mar 14, 2020, 5:29 AM IST

గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి టీమిండియా మాజీ సారథి ధోనీ.. భారత జెర్సీ వేసుకోలేదు. అయితే దాదాపు 8 నెలల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్​ కోసం ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సుమారు రెండు వారాలుగా కసరత్తులు చేస్తున్నాడు.

Chennai Super Kings
ప్రాక్టీస్​లో ధోనీ

కరోనా వైరస్​ వ్యాప్తి, ఐపీఎల్​ వాయిదా కారణంగా తాజాగా ప్రాక్టీస్​ సెషన్​ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చెన్నై సూపర్​కింగ్స్​ యాజమాన్యం. రెండు వారాల తర్వాత మళ్లీ శిక్షణ​ మొదలవుతుందని అధికారికంగా వెల్లడించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ ప్రపంచకప్​లో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్​ కీలకం. ఇలాంటి సమయంలో మెగాటోర్నీ వాయిదా పడింది. ఒకవేళ ఈ లీగ్​ రద్దయితే ధోనీ భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Chennai Super Kings suspend practice sessions due to Corona outbreak, Dhoni Career under Question mark!
శిక్షణలో చెన్నై ఆటగాళ్లు

అక్టోబర్​ నుంచి మొదలయ్యే పురుషుల టీ20 ప్రపంచకప్​ ముందు జరుగుతున్న ఏకైక టోర్నీ ఇదే. ఫలితంగా దీనిపై ధోనీ భారీగానే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. టీమిండియా సెలక్టర్లు ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా మహీకి జట్టులో చోటివ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. గతంలోనే కోచ్‌ రవిశాస్త్రి కూడా ధోనీ టీమిండియాలోకి రావాలంటే.. ఐపీఎల్‌ ప్రదర్శన కీలకమని చెప్పాడు.

Chennai Super Kings
కీపింగ్​ చేస్తూ ధోనీ

ధోనీ రాక సందిగ్ధమే..

భారత జట్టులో ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు పంత్​, రాహుల్​ వంటి యువ ఆటగాళ్లు పోటీపడుతున్నారు. రాహుల్​ బ్యాటింగ్​, కీపింగ్​లో రాణిస్తున్నా.. పంత్​ ఫామ్​ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. అయితే రాహుల్​ను ఫుల్​టైం కీపర్​గా చేయొద్దని కొంతమంది క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే అతడి బ్యాటింగ్ లయ​ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ రాహుల్​ గాయపడితే అతడి ప్రదర్శనను భర్తీ చేసే ఆటగాడూ ప్రస్తుతం ఎవరూ లేరన్నది మరో వాదన. ఈ నేపథ్యంలో ధోనీ, పంత్​ మధ్య కీపింగ్​ కోసం పోటీ నెలకొంది. ఇలాంటి కీలక సమయంలో అసలు టోర్నీ జరుగుతుందని స్పష్టత లేకపోవడం వల్ల వీరిద్దరి పరిస్థతి అయోమయంలో పడిపోయింది. వీరిద్దరికీ కూడా తమ ఫామ్​ నిరూపించుకోడానికి ఐపీఎల్​ ఒక్కటే అవకాశం ఉండటం గమనార్హం.

Chennai Super Kings
రాహుల్​, పంత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.