ETV Bharat / sports

చెన్నై సూపర్​కింగ్స్.. ఈసారి చితక్కొడుతుందా?

గతేడాది ఐపీఎల్​ క్వాలిఫయర్స్​లో​ అడుగుపెట్టలేకపోయిన చెన్నై జట్టు.. ఈసారి తమ సత్తా ఏంటో చూపెట్టాలని భావిస్తోంది. ఇందులో ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేసింది. ఈ సంధర్భంగా ధోనీసేన బలాలు, బలహీనతలు ఏంటి? తదితర విషయాలు మీకోసం.

chennai super kings preview of IPL 2021
చెన్నై సూపర్​కింగ్స్
author img

By

Published : Mar 31, 2021, 7:01 AM IST

చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటి. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలోనూ దాని స్థానం ముందు వరుసలోనే ఉంటుంది. లీగ్‌లో అత్యధికంగా ఎనిమిది ఫైనల్స్‌ ఆడిన జట్టుగా ఘనత సాధించడమే కాదు.. గత సీజన్‌ ముందు వరకు టోర్నీలో బరిలోకి దిగిన ప్రతిసారీ సెమీస్‌/ప్లేఆఫ్‌ ఆడిన రికార్డూ ఆ జట్టు సొంతం. కానీ నిరుడు యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో కథ మారిపోయింది. ఎన్నడూ లేని విధంగా పేలవ ప్రదర్శన చేసింది. తొలిసారి ప్లేఆఫ్‌కు దూరమైంది. దీంతో సీఎస్‌కే సామర్థ్యంపై ఎన్నో సందేహాలు! ఆ జట్టు భవితవ్యంపైనా ఎన్నో ప్రశ్నలు! వాటికి ధోనీ బృందం.. ఐపీఎల్‌-14లో ఎలాంటి సమాధానం చెబుతుందన్నది ఆసక్తికరం.

ఉత్తమ ప్రదర్శన 2010, 2011, 2018లో ఛాంపియన్‌

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ది ఘన ప్రస్థానం. 2008లో తొలి సీజన్లోనే రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. ఇంకో రెండేళ్ల తర్వాత ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాతి ఏడాది కూడా టైటిల్‌ అందుకుంది. ఐపీఎల్‌లో మరే జట్టుకూ సాధ్యం కాని నిలకడను, ఉన్నత స్థాయి ఆటను ప్రదర్శించిన జట్టు సీఎస్‌కే. అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ముంబయి రికార్డు నెలకొల్పి ఉండొచ్చు కానీ.. ఆ జట్టుకు కూడా సాధ్యం కాని విధంగా గత సీజన్‌ ముందు వరకు ప్రతిసారీ సెమీస్‌/ప్లేఆఫ్‌ చేరిన ఘనత చెన్నై సొంతం. స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం కారణంగా నిషేధం పడటం వల్ల 2016, 17 సీజన్లకు దూరమైన ఆ జట్టు.. పునరాగమనంలో తొలి ఏడాదే ఛాంపియన్‌ అయింది. తర్వాతి ఏడాది రన్నరప్‌గా నిలిచింది. కాగితం మీద చెన్నై జట్టును చూసి విశ్లేషకులు ఈసారి కష్టమే అనడం.. తీరా టోర్నీ మొదలయ్యాక అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు ముందంజ వేయడం.. చాలాసార్లు జరిగింది. అయితే గత సీజన్లో మాత్రం సీఎస్‌కే అనూహ్యంగా తడబడింది. ధోనీకి ఇదే చివరి సీజన్‌ కావచ్చన్న అంచనాల నేపథ్యంలో అతనెలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

suresh raina IPL csk
సురేశ్ రైనా

దేశీయ ఆటగాళ్లు: ధోనీ (కెప్టెన్‌), సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రుతురాజ్‌ గైక్వాడ్‌, నారాయణ్‌ జగదీశన్‌, పుజారా, రవీంద్ర జడేజా, ఉతప్ప, కృష్ణప్ప గౌతమ్‌, కర్ణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, హరిశంకర్‌ రెడ్డి, భగత్‌ వర్మ, హరి నిశాంత్‌, కేఎం అసిఫ్‌, సాయికిశోర్‌.

విదేశీయులు: డుప్లెసిస్‌, డ్వేన్‌ బ్రావో, సామ్‌ కరన్‌, ఎంగిడి, హేజిల్‌వుడ్‌, తాహిర్‌, మొయిన్‌ అలీ, శాంట్నర్‌.

బలాలు

గత సీజన్‌లో ఏం జరిగినప్పటికీ.. ధోనీ మీద చెన్నై ఎంతో భరోసాతో ఉంది. మహీలోని మేటి ఆటగాడు, కెప్టెన్‌ ఈ సీజన్లో మళ్లీ బయటికి వస్తాడని ఆశిస్తోంది. ధోనీ బ్యాటింగ్‌లో ఫామ్‌ అందుకున్నాడంటే.. చెన్నైకి తిరుగులేనట్లే. గత సీజన్లో అతడి వ్యక్తిగత వైఫల్యం జట్టుపై ప్రభావం చూపించింది. రైనా పునరాగమనం వల్ల టాప్‌ఆర్డర్లో ఏర్పడిన లోటు భర్తీ అయినట్లే. బ్యాటింగ్‌లో సమతూకం వస్తుంది. రవీంద్ర జడేజా, కృష్ణప్ప గౌతమ్‌, సామ్‌ కరన్‌, డ్వేన్‌ బ్రావో లాంటి ఆల్‌రౌండర్లలో చెన్నై జట్టు కళకళలాడుతోంది. సీనియర్లు ధోనీ, డుప్లెసిస్‌, రైనా, రాయుడు, ఉతప్పలకు తోడు కుర్రాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, నారాయణ్‌ జగదీశన్‌ల రూపంలో బ్యాటింగ్‌ ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న కరన్‌ ఈసారి చెన్నై జట్టుకు పెద్ద బలమవుతాడని భావిస్తున్నారు. బ్యాటింగ్‌ జోరు పెంచిన జడేజా మీదా మంచి అంచనాలే ఉన్నాయి. శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, ఎంగిడి, హేజిల్‌వుడ్‌, తాహిర్‌లతో చెన్నైకి బౌలింగ్ బలం దండిగా ఉంది.

dhoni with sam curran
సామ్ కరన్​తో ధోనీ

బలహీనతలు

ధోనీ చెన్నైకి బలమే కాదు.. బలహీనతగా మారే ప్రమాదమూ లేకపోలేదు. గత సీజన్లో అదే జరిగింది. ఆ అనుభవంతో ఫిట్‌నెస్‌, బ్యాటింగ్‌ మెరుగుపరుచుకుని ఈసారి తనదైన ముద్ర వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి ధోనీ జోరందుకోకుంటే సీఎస్‌కేపై అది ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నా.. గత సీజన్లో సరైన తుది జట్టును ఎంచుకోక చెన్నై ఇబ్బంది పడింది. ఈసారి కూడా కూర్పు విషయంలో ధోనీకి తలనొప్పి తప్పకపోవచ్చు. మిగతా జట్లన్నీ వద్దనుకున్న పుజారాను ఎంచుకున్న ఆ జట్టు.. తుది జట్టులో అతడికి చోటివ్వడానికి ప్రయత్నిస్తే కూర్పు దెబ్బ తినొచ్చేమో! గతంలో అశ్విన్‌, హర్భజన్‌ల మాదిరి మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచే దేశీయ స్పిన్నర్‌ లేకపోవడం చెన్నైకి ప్రతికూలతే. కర్ణ్‌ శర్మ, గౌతమ్‌ ఆ లోటును ఏమేర భర్తీ చేస్తారో చూడాలి. గత సీజన్లో రుతురాజ్‌, జగదీశన్‌ లాంటి కుర్రాళ్లను సరిగా ఉపయోగించుకోలేకపోయిన చెన్నై.. వీరి నుంచి ఎలాంటి ప్రదర్శన రాబడుతుందో చూడాలి. వాట్సన్‌ దూరమైన నేపథ్యంలో అతడిలా ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే ఆటగాడు జట్టులో ఇప్పుడెవరున్నారన్నది ప్రశ్న.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.