ఐపీఎల్-2020లో ఎట్టకేలకు గెలుపు బాటపట్టింది చెన్నై సూపర్ కింగ్స్. దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది ధోనీ సేన.
168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వార్నర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులే చేయగలింది. రెండో ఇన్నింగ్స్ చివర్లో కేన్ విలియమ్సన్(57), రషీద్ ఖాన్(14) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చెన్నై బౌలర్లలో కరణ్ శర్మ, బ్రావో తలో 2 వికెట్లు పడగొట్టారు.
తడబడిన వార్నర్ సేన...
లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ తడబడింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 9 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. కేన్ విలియమ్సన్తో కలిసి బెయిర్ స్టో(23).. సన్‌రైజర్స్‌ను గాడినపెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ కీలక సమయంలో ఔట్ అయ్యాడు. చివర్లో విలియమ్సన్ జట్టును గెలిపించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే.. నిర్ణీత 20ఓవర్లలో 167 పరుగులు చేసింది. వాట్సన్(42), రాయుడు(41) కీలక సమయంలో పరుగులు రాబట్టగా.. చివర్లో ధోనీ(21), జడేజా(25*)ల మెరుపులతో జట్టు స్కోరు 167కు చేరగలిగింది.
ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరింది సీఎస్కే. మొత్తం మీద 8 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన.. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది.