ETV Bharat / sports

ఐపీఎల్​కు సన్నాహాలు ప్రారంభించిన ఫ్రాంచైజీలు - ipl latest uae held updates

ఐపీఎల్​ నిర్వహణపై ఎటువంటి స్పష్టత రాకముందే ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాయి. యూఏఈ వెళ్లేందుకు ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలు, అక్కడ ఉండేందుకు హోటల్​ గదుల ఏర్పాట్ల విషయాలపై ప్రణాళికలు రచిస్తున్నాయి.

Chartered planes, hotel selection: IPL franchises begin preparations for UAE
ఐపీఎల్​
author img

By

Published : Jul 18, 2020, 8:01 PM IST

కరోనా ఆంక్షల మధ్య ఐపీఎల్​ నిరవధిక వాయిదా పడింది. టీ20 ప్రపంచకప్​ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొంది. ఈ విషయంపై ఐసీసీ స్పష్టతనిస్తేనే.. ఐపీఎల్​ను జరిపే ప్రణాళికపై బీసీసీఐ దృష్టి సారించనుంది. అయితే, ఇప్పటివరకు బోర్డు నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. కానీ, ఐపీఎల్​ ఫ్రాంచైజీలు మాత్రం యూఎఈలో లీగ్​ నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా, ఫ్రాంచైజీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆటగాళ్లకోసం ప్రత్యేక విమానాలు, హోటల్​ గదుల బుకింగ్​ తదితర విషయాలపై అన్ని సన్నాహాలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

"ఇటువంటి విషయాల్లో ముందుగానే ప్లాన్​ చేసుకోవాలి. మాకు ఇచ్చిన కొన్ని ప్రణాళికలను అనుసరించి.. తదనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా అబుదాబిలో ఉండాలనుకుంటున్న హోటళ్లనూ నిర్ణయించాం. యూఏఈకి విమానంలో వెళ్లే సదుపాయం గురించి.. అక్కడ క్వారంటైన్​ సమయాన్ని కూడా అంచనా వేస్తున్నాం. కచ్చితంగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తాం."

-ఫ్రాంచైజీ అధికారి

మొదట స్వదేశంలో ఐసోలేషన్​...

యూఏఈకి వెళ్లే ముందు భారత్​లో ఆటగాళ్లు ఐసోలేషన్​లో ఉండే విధంగా ఆలోచనలు చేస్తున్నట్లు మాజీ ఛాంపియన్​ ఫ్రాంచైజీకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. "ప్రస్తుతం అందరూ ఇళ్లలోనే ఉన్నారు. కాబట్టి మనలో ఒకరు లక్షణాలతో ఉన్నవారైతే.. ఇతరులకూ మహమ్మారి సోకే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని వారాల పాటు ఐసోలేషన్​లో ఉండి పరీక్షలు చేయించుకోవడం మంచిది." అని వివరించారు.

చార్టర్డ్​ విమానాల వైపు చూపులు

ప్రయాణ ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. వీలైనంత వరకు చాలా జట్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. "ఆగస్టు చివరి నాటికి రెగ్యులర్​ విమానాలు నడుస్తాయో లేదో తెలియదు. అదే నెల చివరి నాటికి జట్లు యూఏఈలో ఉండాలని అనుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అద్దె విమానాలను తీసుకోవడమే ఉత్తమ మార్గం. ఒక్కో విమానంలో 35-40 మంది దాకా యూఏఈకి వెళ్తారు." అని ఆ అధికారి పేర్కొన్నారు

ఇక విదేశీ ఆటగాళ్లు భారత్​తో పాటు యూఏఈలోనూ క్వారంటైన్​లో ఉండాల్సి వస్తుందని.. అందుకే నేరుగా వారి దేశాల నుంచే యూఏఈకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.