కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే 3 వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు దీపక్ చాహర్. ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డు సాధించాడు.
4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 కీలక వికట్లు తీశాడు చాహర్. ఇందులో 20 డాట్ బాల్స్ ఉండటం విశేషం. ఇంతకు ముందు 18 డాట్ బాల్స్‌తో ఈ రికార్డు సన్ రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్, పంజాబ్ పేసర్ అంకిత్ రాజ్‌పుత్ పేరిట ఉండేది.
-
Deepak Chahar is our key performer for the @ChennaiIPL innings with bowling figures of 3/20 👏👏#CSKvKKR b pic.twitter.com/kzcYKIeUsv
— IndianPremierLeague (@IPL) April 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Deepak Chahar is our key performer for the @ChennaiIPL innings with bowling figures of 3/20 👏👏#CSKvKKR b pic.twitter.com/kzcYKIeUsv
— IndianPremierLeague (@IPL) April 9, 2019Deepak Chahar is our key performer for the @ChennaiIPL innings with bowling figures of 3/20 👏👏#CSKvKKR b pic.twitter.com/kzcYKIeUsv
— IndianPremierLeague (@IPL) April 9, 2019
మొదటి ఓవర్లోనే క్రిస్ లిన్‌ను ఔట్ చేసిన చాహర్ అనంతరం మూడు, ఐదు ఓవర్లలో నితీష్ రాణా, ఉతప్పను పెవిలియన్ పంపించాడు.
సొంత మైదానంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై.. కోల్‌కతాపై విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది ధోని సేన.