ETV Bharat / sports

'కోహ్లీతో కలిసి ఆడేందుకు వేచి చూస్తున్నా' - ఇంగ్లాండ్​తో టీ20లో తెవాతియాకు చోటు

భారత జట్టు సారథి విరాట్ కోహ్లీతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఆల్​రౌండర్​ రాహుల్ తెవాతియా తెలిపాడు. టెస్టు సిరీస్​ అనంతరం ఇంగ్లాండ్​తో జరగబోయే 5 మ్యాచ్​ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో రాహుల్​కు అవకాశం దక్కింది.

Rahul Tewatia on kohli
'కోహ్లీతో కలిసి ఆడేందుకు వేచి చూస్తున్నా'
author img

By

Published : Feb 21, 2021, 8:35 AM IST

తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలో హరియాణా ఆటగాడు​ రాహుల్ తెవాతియా హర్షం వ్యక్తం చేశాడు. టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీతో కలిసి ఆడేందుకు వేచిచూస్తున్నట్లు పేర్కొన్నాడు.

"ఐపీఎల్​లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడాను. కానీ, భారత జట్టులో ఇప్పుడు ఆయనతో కలిసి ఆడబోతున్నాను. భారత క్రికెట్​ దిగ్గజాలతో డ్రెస్సింగ్​ రూమ్​ షేర్​ చూసుకునే క్షణాల కోసం వేచి చూస్తున్నా. వాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం."

-రాహుల్ తెవాతియా, ఆల్​రౌండర్

2020 ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​ తరపున ఆడి, చక్కటి ప్రదర్శనతో ఉత్తమ ఆల్​రౌండర్​గా అభిమానులను ఆకర్షించాడు తెవాతియా. జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలో.... హరియాణా జట్టులో అడినప్పుడు ఆటలో చాలా మెళకువలు నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.

టెస్టు సిరీస్​ అనంతరం ఇంగ్లాండ్​తో జరగబోయే 5 మ్యాచ్​ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. బ్యాకప్​ వికెట్​ కీపర్​గా ఇషాన్​ కిషన్, ఆల్​రౌండర్​ తెవాటియా​ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఊహించినట్లే సూర్యకుమార్​ యాదవ్​కు కూడా జట్టులో చోటు దక్కింది.

ఇదీ చదవండి:ఇంగ్లాండ్​తో టీ20లకు సూర్యకుమార్​, ఇషాన్​- జట్టు ఇదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.