ETV Bharat / sports

విరాట్​ కోహ్లీకి కివీస్​ పేసర్ ఓపెన్​ ఛాలెంజ్​​ - ట్రెంట్ బౌల్ట్​ ఛాలెంజ్​

కివీస్​ పేస్​ బౌలర్​ ట్రెంట్​ బౌల్ట్​.. శుక్రవారం నుంచి జరిగే మొదటి టెస్టు​లో కోహ్లీ వికెట్​ సాధించటమే తన లక్ష్యమని అన్నాడు.

Can't wait to get Virat out, announces fit-again Boult
విరాట్​ కోహ్లీకి కివీస్​ పేసర్ ఓపెన్​ ఛాలెంజ్​​
author img

By

Published : Feb 18, 2020, 4:49 PM IST

Updated : Mar 1, 2020, 5:58 PM IST

గాయంతో టీ20 సిరీస్​కు దూరమైన న్యూజిలాండ్​ పేసర్​ ట్రెంట్​ బౌల్ట్​.. టీమిండియాతో శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టులో ఆడనున్నాడు. ఆరు వారాల క్రితం ఆసీస్​తో జరిగిన బాక్సింగ్​ డే టెస్టులో కుడిచేతికి గాయమై విశ్రాంతి తీసుకున్నాడీ బౌలర్. తాజాగా కోలుకోని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీని ఔట్​ చేయటమే తన లక్ష్యమని అన్నాడు బౌల్ట్.

"కోహ్లీ అసాధరణమైన బ్యాట్స్​మన్​ అని అందరికి తెలుసు. అలాంటి ప్రమాదకర బ్యాట్స్​మన్​ను ఔట్​ చేయటమే కాకుండా వ్యక్తిగతంగానూ నన్ను నేను పరీక్షించుకునే సమయమిది. అతడి వికెట్​ సాధించటానికే ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నా. ఆరు వారాలుగా విశ్రాంతిలో ఉన్నా. మైదానంలో అడుగుపెట్టేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నా"

- ట్రెంట్​ బౌల్ట్​, న్యూజిలాండ్​ పేసర్​

టీ20 సిరీస్‌లో కివీస్​​పై భారత్​.. 0-5తో గెలవడం తనకు నిరాశ కలిగించిందని అన్నాడు బౌల్డ్. కానీ వన్డే సిరీస్​లో టీమిండియాపై 3-0 తేడాతో తమ జట్టు క్లీన్​స్వీప్​ చేసినందుకు చాలా ఆనంద పడ్డానని చెప్పాడు. బౌల్ట్​ ఇప్పటివరకు 65 టెస్టులాడి 256 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్: ప్రాక్టీస్ మ్యాచ్​లో టీమిండియా విజయం

Last Updated : Mar 1, 2020, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.