బ్రియన్ లారా, రికీ పాంటింగ్.. ఇద్దరూ క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. వారి వారి జట్లకు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరు బ్యాట్ పట్టబోతున్నారు. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించనుంది ఆసీస్ క్రికెట్ బోర్డు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. తాజాగా అందుకోసం ప్రాక్టీస్‌ను మొదలుపెట్టారు పాంటింగ్, లారా. నెట్ సెషన్లో పాల్గొని బ్యాట్ పట్టారు. దీనికి సంబంధించిన వీడియోను పాంటింగ్ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు.
-
Just like riding a bike. A very slow bike. pic.twitter.com/Ba6dnHIBzO
— Ricky Ponting AO (@RickyPonting) February 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just like riding a bike. A very slow bike. pic.twitter.com/Ba6dnHIBzO
— Ricky Ponting AO (@RickyPonting) February 6, 2020Just like riding a bike. A very slow bike. pic.twitter.com/Ba6dnHIBzO
— Ricky Ponting AO (@RickyPonting) February 6, 2020
ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్‌తో పాటు పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ వసీం అక్రమ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, మాథ్యూ హెడెన్, ఆండ్రూ సైమండ్స్, బ్రాడ్ హడిన్, మైక్ హస్సీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైఖెల్ క్లార్క్, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్ వెల్ బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు నాన్ ప్లేయింగ్ కెప్టెన్లుగా ఆసీస్ మహిళా క్రికెటర్ మేల్ జేన్స్, స్టీవ్ వా కూడా కనువిందు చేయనున్నారు.
-
If I'm batting three on Sunday, hopefully this guy is on my team and batting four @brianlara pic.twitter.com/dsaXhJTLoU
— Ricky Ponting AO (@RickyPonting) February 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">If I'm batting three on Sunday, hopefully this guy is on my team and batting four @brianlara pic.twitter.com/dsaXhJTLoU
— Ricky Ponting AO (@RickyPonting) February 6, 2020If I'm batting three on Sunday, hopefully this guy is on my team and batting four @brianlara pic.twitter.com/dsaXhJTLoU
— Ricky Ponting AO (@RickyPonting) February 6, 2020
ఇవీ చూడండి.. ఆస్ట్రేలియా బుష్ఫైర్ ఛారిటీ మ్యాచ్ వాయిదా