దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో ముంబయి బౌలర్ బుమ్రా గాయపడ్డాడు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఫీల్డింగ్ చేస్తూ కిందపడిన బుమ్రా ఎడమచేతికి దెబ్బతగిలింది. వైద్యపరీక్షలు చేసిన అనంతరం.. అతడికి అంత ప్రమాదమేమి లేదని తేలింది.
గాయం కారణంగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా బ్యాటింగ్‌కి రాలేదు. దీంతో పెద్ద దెబ్బే కావచ్చని అందరూ అనుమానించారు. డెత్ ఓవర్ల స్పెషలిస్టు బౌలర్‌గా పేరొందిన బుమ్రా.. ప్రపంచకప్‌లో భారత జట్టుకు చాలా అవసరం.
ఈ నెల29న రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆర్సీబీతో తలపడనుంది. జట్టు ఇప్పటికే బెంగళూరు చేరుకుంది. బుమ్రా మాత్రం ముంబయిలోనే ఉండిపోయాడు.
ఇవీ చూడండి..అమెరికా బౌట్‌కు విజేందర్ దూరం- గాయమే కారణం