టీమ్‌ఇండియా ప్రముఖ పేసర్లు బుమ్రా, షమి ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో అన్ని మ్యాచ్‌లు ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయి ఫిట్‌నెస్, సామర్థ్యంతో వీరిద్దరు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 27 నుంచి డిసెంబరు 8 మధ్య ఆసీస్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. డిసెంబరు 17న అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. మొదటి టెస్టుకు ఇషాంత్ శర్మ ఆడకపోవచ్చు. అందువల్ల పేసర్లు బుమ్రా, షమిలపై పనిభారం పడకుండా కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ జాగ్రత్తలు తీసకుంటున్నారు.
ప్రాక్టీసు మ్యాచ్‌లకు కష్టమే!
డిసెంబరు 4, 6, 8 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అదే సమయంలో (డిసెంబరు 6 నుంచి 8) మొదటి వార్మప్ మ్యాచ్, 11 నుంచి 13 వరకు రెండో వార్మప్ మ్యాచ్ (గులాబి బంతి) ఆడనున్నారు. షమి, బుమ్రా వన్డేలతో పాటు టీ20 సిరీస్ ఆడితే.. తొలి వార్మప్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరు.
వారిద్దరే కీలకం
టెస్టు సిరీస్ కోసం షమి, బుమ్రా ఫిట్‌గా, ఫామ్‌లో ఉండటం టీమ్‌ఇండియాకు కీలకం. అందుకే 12 రోజుల వ్యవధిలో జరిగే ఆరు మ్యాచ్‌ల్లో(మూడేసి వన్డేలు, టీ20లు) వారిని ఆడించడం అనుమానంగానే కనిపిస్తోంది. అందుకే వన్డే సిరీస్‌కే వారిని పరిమితం చేసి.. టీ20ల్లో దీపక్ చాహర్, నటరాజన్, నవదీప్ సైనీలకు అవకాశం ఇవ్వొచ్చని జట్టు వర్గాలు తెలిపాయి.