ETV Bharat / sports

బుమ్రా మరింత దూకుడుగా ఆడాలి: జహీర్

న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో జస్ప్రీత్ బుమ్రా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయకుండా నిరాశపర్చాడు. దీనిపై జహీర్ ఖాన్ స్పందిస్తూ బుమ్రా మరింత దూకుడుగా బౌలింగ్ చేయాలని సూచించాడు.

బుమ్రా
బుమ్రా
author img

By

Published : Feb 13, 2020, 6:24 PM IST

Updated : Mar 1, 2020, 5:54 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఫలితంగా విమర్శల పాలయ్యాడు. తాజాగా ఈ విషయమై స్పందించిన భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ బుమ్రా మరింత దూకుడుగా ఉండాలని సూచించాడు.

"బుమ్రా తన బౌలింగ్​తో ఎంతో గుర్తింపు సాధించాడు. మరి అలాంటప్పుడు దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వికెట్లను సాధించాలంటే మరింత దూకుడుగా ఆడాలి."

-జహీర్ ఖాన్, టీమిండియా మాజీ పేసర్

ప్రత్యర్థి జట్లు బుమ్రా బౌలింగ్​ను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నాయని తెలిపాడు జహీర్. వారు బుమ్రా వేసిన 10 ఓవర్లలో 35 పరుగులు వచ్చినా చాలనుకుని.. మిగతా బౌలర్ల బౌలింగ్​లో ఎదురుదాడి చేస్తున్నారని అన్నాడు.

"బుమ్రా బౌలింగ్​కు బ్యాట్స్​మెన్ గౌరవం ఇస్తూ వికెట్లను కాపాడుకుంటున్నారు. అలాంటప్పుడు బుమ్రా వారిని బంతిని ఆడేలా చేయాలి. పరుగుల్ని కట్టడి చేయడం కంటే వికెట్లను తీయడంపై బుమ్రా దృష్టిసారించాలి."

-జహీర్ ఖాన్, టీమిండియా మాజీ పేసర్

భారత్-న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ఈనెల 21న ప్రారంభంకానుంది. ఇప్పటికే జరిగిన టీ20 సిరీస్​ను టీమిండియా కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్​ను కివీస్ దక్కించుకుంది.

Last Updated : Mar 1, 2020, 5:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.