ETV Bharat / sports

'ప్రస్తుతం అత్యంత తెలివైన బౌలర్​ బుమ్రా' - తెలివైన బౌలర్​ బుమ్రా

పేసర్ బుమ్రాను ప్రశంసించాడు పాక్​ మాజీ ఆటగాడు​ షోయబ్​ అక్తర్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్​లో తన బౌలింగ్​తో విధ్వంసం సృష్టిస్తున్నాడని అన్నాడు.

Bumrah is probably the smartest fast bowler presently: Shoaib Akhtar
'అత్యంత తెలివైన బౌలర్​ బుమ్రా'
author img

By

Published : Jan 1, 2021, 2:02 PM IST

ప్రపంచ క్రికెట్​లో ప్రస్తుతం అత్యంత తెలివైన బౌలర్​ బుమ్రా అని పాక్​ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పాడు. మహ్మద్ ఆమిర్​తో పాటు బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు.

"అతడు (బుమ్రా) చాలా తెలివైన బౌలర్. అయితే బుమ్రా, మహ్మద్​ ఆమిర్, వసీం అక్రమ్​ల కన్నా మహ్మద్​ ఆసిఫ్ విధ్వంసకర బౌలర్. అతడి బౌలింగ్​లో ఆడాలంటే బ్యాట్స్​మెన్​కు ఏడుపొచ్చేది. దిగ్గజాలు లక్ష్మణ్, డివిలియర్స్​లే విలవిలలాడిపోయేవారు. ఆసిఫ్ తర్వాత అంత తెలివైన బౌలర్ ప్రస్తుతానికి బుమ్రానే" -షోయబ్ అక్తర్, పాక్​ మాజీ పేసర్

ఇషాంత్​, షమిల గైర్హాజరీతో భారత పేస్ దళాన్ని బుమ్రా ముందుండి నడిపిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో కలిపి 8 వికెట్లు తీశాడు. అతడి దూకుడు బౌలింగ్ లెంగ్త్​లో ఉంటుందని, స్వభావంలో కాదని అక్తర్ చెప్పాడు.

"టెస్టు క్రికెట్​లో అతడి ఫిట్​నెస్​పై చాలామందికి అనుమానాలు ఉండేవి. అయితే అతడు వేగవంతమైన బౌన్సర్లతో బ్యాట్స్​మెన్​ను బోల్తా కొట్టిస్తాడు. బుమ్రాది మంచి వ్యక్తిత్వం. అతడి దూకుడు బౌలింగ్​ లెంగ్త్​లో ఉంటుంది, స్వభావంలో కాదు. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్​ను గెలిపించగల సత్తా ఉన్న బౌలర్ బుమ్రా" -షోయబ్ అక్తర్, పాక్​ మాజీ పేసర్

నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 1-1తో భారత్​, ఆస్ట్రేలియా సమంగా ఉన్నాయి. తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమ్​ఇండియా.. బాక్సింగ్​డే మ్యాచ్​లో పుంజుకుని చిరస్మరణీయ విజయం అందుకుంది. జనవరి 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: 'భారత బౌలర్ల ఉచ్చులో పడిపోయాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.