టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలపై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక మాజీ ఆటగాడు, ముంబయి ఇండియన్స్ కోచ్ మహెళా జయవర్ధనే. వీరిద్దరి ఆటను తాను ఎంతగానో ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు.
"బుమ్రా మధ్య ఓవర్లలో వైవిధ్యంగా ఆడతాడు. మైదానంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. దాన్ని నేను ఎంతో ఇష్టపడతా. అలాగే హార్దిక్ పాండ్యా కూడా తన అద్భుతమైన ప్రదర్శనతో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ చెలరేగిపోతాడు. ఇటువంటి ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ముంబయి ఇండియన్స్ తరఫున ఆడటం ఎంతో ఆనందకరమైన విషయం."
-మహెళా జయవర్ధనే, ముంబయి ఇండియన్స్ కోచ్
2013 ఐపీఎల్లో ముంబయి తరఫున ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే హార్దిక్ కూడా ప్రారంభ, డెత్ ఓవర్లలో చురుకైన బౌలింగ్‌తో చెలరేగి మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే నాలుగు టైటిల్స్ సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. ప్రస్తుతం కరోనా వల్ల 13వ సీజన్‌ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ.
ఇది చూడండి : హార్దిక్ 'పుష్అప్స్'కు బాలీవుడ్ భామలు ఫిదా