ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. టెస్టు క్రికెట్లో 500 వికెట్లు దక్కించుకుని అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా వెస్డిండీస్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో ఈ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. అయితే తాజాగా దీనిపై స్పందించిన తన సహచర దిగ్గజ ఆటగాడు జేమ్స్ అండర్సన్.. బ్రాడ్‌పై ప్రశంసలతో ముంచెత్తాడు. ఇలానే అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తే భవిష్యత్తులో తన రికార్డును బద్దలకొడతాడని అభిప్రాయపడ్డాడు. మరిన్ని విజయాలు సాధిస్తాడని కొనియాడాడు.
![Broad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8207150_252_8207150_1595941885308.png)
ప్రస్తుతం విండీస్‌తో జరుగుతోన్న సిరీస్‌లో గత రెండు టెస్టుల్లో బ్రాడ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడని అన్నాడు అండర్సన్. బ్రాడ్ ఈ ఘనత సాధిస్తాడని తామెవరం అంచనా వేయలేదని వెల్లడించాడు.
ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలర్ అండర్సన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పీడ్‌గన్ గ్లెన్ మెక్‌గ్రాత్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు కోర్ట్నీ వాల్ష్ ఇప్పటికే 500 వికెట్ల క్లబ్లో చేరారు. తాజాగా ఈ జాబితాలో చేరిన..నాలుగొవ క్రికెటర్‌గా బ్రాడ్ నిలిచాడు.
![Anderson](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/https___prodstatic9netau___media_2017_09_11_08_53_anderson_110917_f_1000_2307newsroom_1595491824_888.jpg)
ఇది చూడండి టెస్టు కెరీర్లో 500 వికెట్లు సాధించిన బ్రాడ్