ETV Bharat / sports

కుల్దీప్​ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది: అగార్కర్​ - కుల్దీప్​పై అజిత్ అగార్కర్

ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు కుల్దీప్​ను ఎంపిక చేయకపోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశాడు టీమ్​ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్. కుల్దీప్​ లాంటి నాణ్యమైన స్పిన్నర్​కు జట్టులో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

Brisbane Test: Kuldeep Yadav will be very disappointed, surprised he is not playing, says Ajit Agarkar
'కుల్దీప్​ కచ్చితంగా నిరాశ చెంది ఉంటాడు'
author img

By

Published : Jan 15, 2021, 12:05 PM IST

బ్రిస్బేన్​ టెస్టులో ఆడే అవకాశం లభించనందున స్పిన్నర్ కుల్దీప్​ యాదవ్​ తీవ్రంగా నిరుత్సాహపడి ఉంటాడని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అన్నాడు. 2019 ఆస్ట్రేలియా పర్యటనలో కుల్దీప్​ అద్భుతంగా రాణించినా అతడిని యాజమాన్యం పక్కనపెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు.

"కుల్దీప్ చాలా నిరాశ చెంది ఉంటాడు. చెందాలి కూడా. గత ఆస్ట్రేలియా పర్యటన ముగిసే నాటికి భారత్​కు అతడే నం.1 స్పిన్నర్. నాకు తెలిసి అప్పటి నుంచి అతడు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. జట్టులో ఐదుగురు బౌలర్లు ఉన్నప్పుడు ఎవరైనా అనుభవజ్ఞుల వైపు చూస్తారు. కానీ యాజమాన్యం అందుకు భిన్నంగా ఆలోచించింది. ఆల్​రౌండర్ జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్​ను తీసుకున్నారు. మరో స్పిన్నర్​ ఉంటే బౌలింగ్​ లైనప్​లో సమం అయ్యేది."

- అజిత్ అగార్కర్, భారత మాజీ క్రికెటర్

2019 సిరీస్​లో సిడ్నీ మ్యాచ్​లో 5వికెట్లు తీసిన కుల్దీప్.. భారత్ 2-1తో సిరీస్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.​ అప్పటినుంచి అతడు టెస్టు ఆడకపోవడం గమనార్హం.

ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సీనియర్​ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, జడేజా, విహారి గాయల బారిన పడ్డారు. దీంతో బ్రిస్బేన్​లో జరుగుతోన్న ఆఖరి టెస్టులో యువ బౌలర్లు టి.నటరాజన్, వాషింగ్టన్ సుందర్​ అరంగేట్రం చేశారు.

ఇదీ చూడండి: బ్రిస్బేన్​ టెస్టు: నటరాజన్​, సుందర్​ అరంగేట్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.