ETV Bharat / sports

టీమ్​ఇండియా అద్భుతంగా ఆడుతోంది: బ్రెట్​ లీ

భారత మహిళా జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు ఆస్ట్రేలియా​ మాజీ బౌలర్​ బ్రెట్​ లీ. ముఖ్యంగా షెఫాలీ వర్మ, పూనమ్​ యాదవ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు.

Brett Lee backs India to make maiden women's T20 World Cup final
భారత మహిళా జట్టు అద్భుతంగా ఆడింది
author img

By

Published : Mar 3, 2020, 6:00 PM IST

Updated : Mar 3, 2020, 6:49 PM IST

మహిళా టీ20 ప్రపంచ కప్​లో గెలుపే లక్ష్యంగా టీమ్​ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​, న్యూజిలాండ్​, శ్రీలంకతో జరిగిన మ్యాచ్​ల్లో విజయకేతనం ఎగురవేసింది. టోర్నీలో సెమీ ఫైనల్​కు చేరిన తొలి జట్టుగా ఘనత సాధించింది.

తాజాగా భారత మహిళా జట్టు విజయాలపై స్పందించాడు ఆస్ట్రేలియా​ మాజీ బౌలర్​ బ్రెట్ లీ. అద్భుతంగా ఆడారని ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ, లెగ్​ స్పినర్​ పూనమ్​ యాదవ్​లను కొనియాడాడు. వీరిద్దరూ టీమ్​ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారని తెలిపాడు.

"భారత్​ జట్టు మెగాటోర్నీలో ఇదివరకు ఎప్పుడూ ఫైనల్​కు చేరుకోలేదు. కానీ ఈసారి భారత జట్టు వేరు. ఇంతకుముందు నేనెప్పుడు చూడని విధంగా మెరుగ్గా ఆడుతున్నారు. షెఫాలీ వర్మ బ్యాట్​తో, పూనమ్​ యాదవ్ బంతితో విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.​"

-బ్రెట్​ లీ, ఆసీస్​ మాజీ బౌలర్​ .

సెమీఫైనల్స్​లో ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా, ప్రత్యేకమైన శ్రద్ధతో ఆడితేగాని టీమ్​ఇండియా జట్టుపై విజయం సాధించలేరని బ్రెట్​ లీ అభిప్రాయపడ్డాడు. లేకపోతే భారత్ ఫైనల్స్​కు చేరడం ఖాయం అని తెలిపాడు.

ఈ గురువారం భారత మహిళా జట్టు సెమీ ఫైనల్స్​లో ఇంగ్లాండ్​తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్​లో గెలిచి తొలిసారి ఫైనల్​లో అడుగుపెట్టాలని భావిస్తోంది.

ఇదీ చూడండి : విరాట్​ కోహ్లీని పొగడ్తలతోనే పడగొట్టేశారుగా!

Last Updated : Mar 3, 2020, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.