బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అయన కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మరోసారి ఛాతీనొప్పి రావడం వల్ల ఆయన ఆస్పత్రిలో చేర్పించారు.
కొన్నాళ్ల క్రితమే దాదాకు గుండెనొప్పి వచ్చింది. ఉదయం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుండగా వాంతులు, తలనొప్పి, ఛాతినొప్పి వచ్చిందని ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో రెండుచోట్ల పూడికలు వచ్చినట్టు గుర్తించారు. ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేశారు. రెండు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే మరోసారి ఆయనకు యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.