ETV Bharat / sports

'ప్రస్తుతం బౌలర్లంతా రివర్స్​ స్వింగ్​ మర్చిపోండి'

బౌలర్లు కొద్దికాలం పాటు రివర్స్​ స్వింగ్​ను మర్చిపోవాలని టీమ్​ఇండియా మాజీ పేసర్​ ఇర్ఫాన్​ పఠాన్​ తెలిపాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్​ మధ్య జరిగిన మ్యాచ్​లో.. మార్క్​ వుడ్​, జోఫ్రా ఆర్చర్​ బౌలింగ్​ చూసిన అనంతరం పఠాన్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Bowling in times of COVID-19: Forget reverse swing for now, says Pathan
ఇర్ఫాన్ పఠాన్​
author img

By

Published : Jul 14, 2020, 5:32 AM IST

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య బయో సెక్యూర్​ విధానంలో నిర్వహించిన తొలి టెస్టు కరోనా విరామం తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్. అయితే ఈ పోరుపై టీమ్​ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ బౌలర్లు కొద్దికాలం పాటు రివర్స్​ స్వింగ్​ను మరచిపోవాలని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో ఐదోరోజు జరిగిన మ్యాచ్​లో మార్క్​ వుడ్​, జోఫ్రా ఆర్చర్​ బౌలింగ్​ చూసిన పఠాన్.. ఈ వ్యాఖ్యలు చేశాడు. కరోనా వ్యాప్తి ముప్పు నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్​లో లాలాజలం నిషేధించింది ఐసీసీ. ఈ క్రమంలోనే బౌలర్లకు కష్టంగా మారింది.

"లాలాజలం మందంగా ఉంటుంది. అందుకే చెమట కంటే వేగంగా బంతిని మెరిసేలా చేసి రివర్స్​ స్వింగ్​ చేయడానికి వీలు కల్పిస్తుంది. మహమ్మారి కారణంగా లాలాజలం నిషేధం కొనసాగే వరకు బౌలర్లకు కాస్త కష్టమే. కాబట్టి కొంత కాలం రివర్స్​ స్వింగ్​ను మర్చిపోండి. ఫాస్ట్​ బౌలింగ్​కు అనుకూలంగా ఉండే పిచ్​లను తయారు చేయండి. పిచ్​పై తేమ ఉంచడం మంచిదని నా సలహా. దీంతో బంతి ఉపరితలం ఆ తేమను పట్టుకుంటుంది. ఫలితంగా చెమట, లాలాజలం వినియోగానికి దూరంగా ఉండే అవకాశం ఉంది."

ఇర్ఫాన్​ పఠాన్​, భారత మాజీ బౌలర్​

అంతర్జాతీయ క్రికెట్​లో లాలాజలం నిషేధంతో స్వింగ్​ చేయడానికి సమస్య ఏర్పడటం వల్ల.. జిమ్మీ అండర్సన్​ బౌలింగ్​లో ఇబ్బంది పడినట్లు తెలిపాడు టీమ్​ఇండియా క్రికెటర్​ ఆశిష్​ నెహ్రా. "అండర్సన్​ కొన్ని సార్లు షార్ట్​ లెన్త్​ బౌలింగ్​ చేస్తున్నాడు. అతనెప్పుడూ గతంలో అలా చేయలేదు. ఎందుకంటే లాలాజలం అనుమతించకపోవడం వల్ల బంతికి మెరుపు తెప్పించడం కష్టమైంది. అందుకే బంతి స్వింగ్​కు అనుగుణంగా లేదు. చెమట లేనప్పుడు లాలాజలం ఉపయోగించలేకపోవడం పెద్ద సమస్యే. స్వింగ్​ చేసి వెనక కీపర్​ క్యాచ్​, స్లిప్​ క్యాచ్​కు అవకాశాన్నివ్వడమే అండర్సన్​ బలం. ఇప్పుడు ఆ స్వింగ్​ ఆగిపోయినప్పుడు అతను సగం బౌలర్​గా కనిపించాడు." అని నెహ్రా వెల్లడించాడు.

ఇదీ చూడండి:ఆకాశ్ చోప్రా ప్రకారం బెస్ట్ ఫీల్డర్స్ వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.