ఇటీవల జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి పాలైన న్యూజిలాండ్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్పై దృష్టి సారించింది. వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. లంక ఆతిథ్యమిస్తున్న ఈ పోరుకు సోమవారం జట్టును ప్రకటించింది కివీస్. స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యమిస్తూ 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
స్పిన్ విభాగంలో అజాజ్ పటేల్, విల్ సోమర్విల్లే, మిచెల్ సాంట్నర్, టాడ్ ఆస్టల్ ఎంపికయ్యారు. పేస్ బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్, కొలిన్ డి గ్రాండ్హామ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
"శ్రీలంకతో ప్రతి మ్యాచ్కు ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపనున్నాం. వీరు తమ బౌలింగ్లో భిన్నత్వం చూపి వికెట్లు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచకప్ తర్వాత మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇప్పుడు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాం." -గ్యారీ స్టెడ్, న్యూజిలాండ్ కోచ్
న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్, జీత్ రావల్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, వాల్టింగ్, టామ్ బ్లండెల్, కొలిన్ డి గ్రాండ్హామ్, మిచెల్ సాంట్నర్, టాడ్ ఆస్టల్, టిమ్ సౌథీ, విల్ సోమర్విల్లే, నీల్ వాగ్నర్, అజాజ్ పటేల్, ట్రెంట్ బౌల్ట్
ఇది చదవండి: టెస్టు ఛాంపియన్షిప్ కోసం ఆత్రుతగా ఎదురూచూస్తున్నామన్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ