ఫిబ్రవరి 6 నుంచి భారత్‌తో జరిగే టీ ట్వంటీ సిరీస్‌కు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ దూరమయ్యాడు. గాయం కారణంగా భారత్‌తో చివరి రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడీ ఈ కివీస్ ఓపెనర్.
బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు గప్తిల్.
ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్‌కు గప్తిల్ లేకపోవటం పెద్ద ఎదురుదెబ్బ. వెన్నునొప్పి కారణంగా భారత్‌తో చివరి రెండు వన్డేలు ఆడని ఈ స్టార్ బ్యాట్స్‌మన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.
"దురదృష్టవశాత్తు గప్తిల్ గాయం నుంచి కోలుకోలేదు. ఐదు రోజుల పాటు జరిగనున్న మూడు టీ20లు రసవత్తరంగా జరగబోతున్నాయి."
-న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టేడ్
ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు న్యూజిలాండ్ భారత్‌తో మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే సిరీస్‌లో గప్తిల్ స్థానంలో జిమ్మి నీషమ్ ఆడాడు. ఈ సిరీస్‌కు ఆల్ రౌండర్ డారిల్ మిచెల్నూ తీసుకున్నారు. వీరిద్దరిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), డాగ్ బ్రాస్‌వెల్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, లాకీ ఫెర్గ్యుసన్, స్కాట్ కుగ్లిజన్, డారిల్ మిచెల్, కొలిన్ మన్రో, జిమ్మి నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌధీ, రాస్ టేలర్