ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తండ్రి గెరాడ్ స్టోక్స్ మరణించారు. ఏడాది కాలంగా బ్రెయిన్ కాన్సర్‌తో బాధపడుతున్న గెరాడ్ స్టోక్స్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గెరాడ్కు చెందిన వర్కింగ్టన్ రగ్బీ టీమ్ ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతాపాన్ని ప్రకటించింది. ఈ రుగ్మతకు చికిత్స పొందడానికి కొన్ని నెలల క్రితమే స్టోక్స్ కుటుంబం న్యూజిలాండ్ చేరుకుంది. తన తండ్రికి చికిత్స చేయించడానికి న్యూజిలాండ్ వెళ్లిన బెన్‌స్టోక్స్.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఆలస్యంగా పాల్గొన్నాడు.
స్టోక్స్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్ కోసం అక్కడే ఉన్నాడు. సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఇటీవలే ఇంగ్లాండ్ సిబ్బందిలో కరోనా కేసులు బయటపడడం వల్ల వన్డే సిరీస్‌ను ఇరు దేశాల క్రికెట్ జట్లు వాయిదా వేశాయి. కేప్‌టౌన్ నుంచి గురువారం తమ జట్టు బయలుదేరుతుందని ఇంగ్లాండ్ బోర్డు వెల్లడించింది.