ఇంగ్లాండ్ క్రికెట్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ న్యాయ పోరాటానికి దిగాడు. వ్యక్తిగత విషయాలను తమ ఆమోదం లేకుండా ప్రచురించిన ఆంగ్ల వార్తా దినపత్రిక 'ది సన్'పై చర్యలు తీసుకోవాలని స్టోక్స్ కోర్టును ఆశ్రయించాడు. బెన్ స్టోక్స్‌తో పాటు అతని తల్లి స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆంగ్ల వార్తా దినపత్రిక అయిన 'ది సన్'.. 'స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ' అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. బెన్ స్టోక్స్ జన్మించడానికి మూడేళ్ల ముందు అతడి కుటుంబంలో జరిగిన ఓ విషాదకర సంఘటనను ప్రచురించింది. స్టోక్స్ సోదరి, సోదరుడిని అతడి తల్లి, మాజీ ప్రియుడు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ వార్తను మూడు దశాబ్దాల తర్వాత హైలెట్ చేస్తూ.. ది సన్ పత్రిక వార్త ప్రచురించింది. స్టోక్స్ కుటుంబానికి సంబంధించిన ఈ సున్నితమైన అంశాన్ని ప్రచురించడంపై ఇంతకుముందే స్టోక్స్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. జర్నలిజం పేరుతో ఇలా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించాడు.
తాజాగా స్టోక్స్ తన భార్యతో గొడవ పెట్టుకున్నాడని ఓ ఇంగ్లీష్ పత్రికలో వార్తలు వచ్చాయి. భార్య క్లారే అతడి చెంపపై కొట్టినట్లు ఫొటోతో సహా ప్రచురితమయ్యాయి. అయితే ఆ ఫోటోలో బెన్ స్టోక్స్‌ను క్లారే కొట్టనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంపై స్టోక్స్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియాలో వరుసగా తన గురించి కథనాలు రావడం పట్ల స్టోక్స్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. ఇతడికి ఇంగ్లండ్ క్రికెటర్లూ మద్దతుగా నిలుస్తున్నారు. స్టోక్స్‌కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలను వారందరూ విమర్శిస్తున్నారు.
ఇవీ చూడండి.. విజయాల 'విరాట్'.. రికార్డుల 'కోహ్లీ'నూర్