టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టాలనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇటీవలే లేఖ కూడా రాశాడు. అయితే యువీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడమనేది బోర్డు విధానాల్లో లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
![BCCI's policy may hamper Yuvraj's return: Official](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bcci-agencies_1009newsroom_1599708328_690.gif)
తుది నిర్ణయం బోర్డుదే!
"యువరాజ్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంపై తుది నిర్ణయం బోర్డు చేతిలో ఉంది. అయినా యువీ ఇప్పటికే వీడ్కోలుకు సంబంధించిన ప్రయోజనం పొందడం సహా నెలవారీ పెన్షన్ అందుకుంటున్నాడు. తిరిగి ఆడాలనే అతడి నిర్ణయం బీసీసీఐ విధానాలకు అడ్డంకి కావొచ్చు. ఏదీ ఏమైనా యువీ పంజాబ్ జట్టులో చేరితే అందులోని ఆటగాళ్లకు గొప్ప అనుభవం దక్కుతుందని" బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
![BCCI's policy may hamper Yuvraj's return: Official](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7e7a8bc51d52b03d430e5917c6d4c911-e1560170518769_1009newsroom_1599708328_153.jpg)
యువఆటగాళ్లకు మార్గనిర్దేశం
గతేడాది జూన్ 10న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్.. ఐపీఎల్లో పంజాబ్ తరపున ఆడటంలో భాగంగా బీసీసీఐ అనుమతి కోరుతూ గంగూలీకి లేఖ రాశాడు. పంజాబ్ తరఫున తప్ప అంతర్జాతీయంగా ఆడే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. కరోనా ప్రభావంతో క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయినా.. పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) విజ్ఞప్తి మేరకు మొహాలీ స్టేడియంలో రెండు సుదీర్ఘ శిబిరాలు నిర్వహించాడు. యువఆటగాళ్లు శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్ యువీ ఆధ్వర్యంలోనే సాధన చేశారు.
మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో యువరాజ్.. 304 వన్డేలు, 58 టీ20లు, 40 టెస్టుల్లో టీమ్ఇండియాకు ఆడాడు.