బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గురించి బోర్డు ఎథిక్స్ అధికారి డీకే జైన్‌కు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఏమ్పీసీఏ) మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద శుక్లా ఒకేసారి రెండు పదవుల్లో కొనసాగుతున్నారని తన లేఖలో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న బోర్డు ఎథిక్స్ అధికారి డీకే జైన్.. విరుద్ధ ప్రయోజనాల అభియోగాలపై శుక్లా, బీసీసీఐ రెండు వారాలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కొంతకాలం క్రితం ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారంటూ ఆరోపణలు రావడం వల్ల గుప్తా.. ఎమ్పీసీఏ నుంచి రాజీనామా చేసి బయటకొచ్చేశారు. టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ కూడా ఒకేసారి రెండు లాభాదాయక పదవులు అనుభవిస్తున్నాడని సంజీవ్ గుప్తానే గతంలోనూ ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి : ద్రవిడ్‌ను వీడని విరుద్ధ ప్రయోజనాల అంశం