ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్​: దేశవాళీ క్రికెట్ ఈ ఏడాది​ లేనట్టే!

దేశంలో కరోనా నానాటికి పెరుగుతున్న కారణంగా దేశవాళీ టోర్నీలను ఈ ఏడాది నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. కనీసం రంజీ ట్రోఫీనైనా నిర్వహిస్తామని గంగూలీ గతంలో చెప్పినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అవి సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ఓ అధికారి అన్నారు.

BCCI unlikely to host domestic cricket this season
కరోనా ఎఫెక్ట్​: దేశవాళీ క్రికెట్​ లేనట్టే!
author img

By

Published : Sep 7, 2020, 7:25 AM IST

కరోనా ప్రభావం భారత దేశవాళీ క్రికెట్‌పై గట్టిగానే పడ్డట్లు కనిపిస్తోంది. ఈ వైరస్‌ భయంతో ఈ ఏడాది దేశవాళీ టోర్నీలు, బీసీసీఐ నిర్వహించేలా కనిపించట్లేదు. మ్యాచ్‌లు కుదించి రంజీ ట్రోఫీ అయినా జరుపుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ గతంలో చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. దేశంలో వైరస్‌ ఉద్ధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదంతా క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

"దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మూణ్నాలుగు నెలల పాటు సాగే దేశవాళీ టోర్నీలు ఎలా నిర్వహించగలరు?"

- బీసీసీఐ అధికారి

దీంతో ఈ సీజన్‌లో ఇక రంజీ, దులీప్‌ ట్రోఫీ, అండర్‌-23 సీకే నాయుడు ట్రోఫీ, విజయ హజారె, దేవధర్‌ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలు చూసే అవకాశం దాదాపుగా లేనట్టే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.