ETV Bharat / sports

మ్యాచులు ఆడకుండానే ఆటగాళ్లకు వేతనం! - దేశవాళీ క్రికెట్​ బోర్డు

కరోనా ముప్పు కారణంగా దేశవాళీ క్రికెట్​ను నిర్వహించాలా వద్దా అనే అయోమయంలో బీసీసీఐ ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. ప్రస్తుతం దీని కోసమే చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

BCCI
దేశవాళీ క్రికెట్
author img

By

Published : Dec 2, 2020, 2:38 PM IST

వచ్చే ఏడాది దేశవాళీ సీజన్​​ నిర్వహించడం కుదరదా? అంటే క్రికెట్​ వర్గాలు అవుననే అంటున్నాయి. కరోనా ఉద్ధృతి కారణంగా ఈ సీజన్​​ నిర్వహణపై బీసీసీఐ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పాల్గొనే ఆటగాళ్లకు బోర్డు వేతనాలను చెల్లిస్తుంది. ఈసారి మాత్రం మ్యాచులు నిర్వహించకుండా డబ్బులు ఇవ్వాలనే యోచనలో బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు సాగుతున్నాయని తెలిపారు.

ఇదే కారణమా?

లాక్​డౌన్​ తర్వాత బయో బుడగలో క్రికెట్​ కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బుడగలో ఐపీఎల్​ను విజయవంతంగా పూర్తిచేసిన బీసీసీఐ.. దేశవాళీ సీజన్​కూ సిద్ధమైంది. అయితే ఈ సీజన్​లో పాల్గొనే 38 జట్లు కోసం బబుల్​ను ఏర్పాటు చేయడం బోర్డుకు కష్టమవుతుందని సదరు అధికారి తెలిపారు. ఒకవేళ సిద్ధం చేసినా ఏమైనా తేడా జరిగితే ఆటగాళ్ల ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశముందని అన్నారు. అందుకే సీజన్​కు సంబంధించిన వేతనాల్ని ఆటగాళ్లకు చెల్లించాలని బోర్డు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇదీ చూడండి : 'ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహణకు సై'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.