చైనా మొబైల్ కంపెనీ వివోతో పాటు ఇతర ఐపీఎల్ వాణిజ్య ఒప్పందాలను సమీక్షించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. గల్వాన్ లోయలో చైనా దళాల చేతుల్లో 20 మంది భారత జవాన్లు మరణించారు. ఈ క్రమంలోనే ఆ దేశ కంపెనీలతో ఒప్పందాలు తెగదెంపులు చేసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువైన వేళ.. బీసీసీఐ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న వివో.. ఏడాదికి రూ.440 కోట్లతో 2022 వరకు ఒప్పందం చేసుకుంది. వివోతో పాటు చైనా కంపెనీ అలీబాబా పెట్టుబడిదారుగా ఉన్న పేటీఎం కూడా ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటి. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చే వారం ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను సమీక్షించేందుకు పాలకమండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ట్వీట్ చేసింది.
చైనా స్పాన్సర్‌షిప్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పాడు. ఇప్పటికిప్పుడు వివోతో ఒప్పందం రద్దు చేసుకునే ఉద్దేశం లేదని ఇదివరకే ధుమాల్ తెలిపారు.
ఇదీ చూడండి: