ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్ సిరీస్​కు ప్రేక్షకుల అనుమతి!

త్వరలో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం 50 శాతం ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. ఆయా రాష్ట్రాల బోర్డులతో చర్చలు జరుపుతోంది. ఈ పర్యటన కోసం ఇంగ్లాండ్​ బోర్డు జట్టును బుధవారం ప్రకటించింది.

BCCI likely to allow 50 percent crowd attendance for England Tests
ఇంగ్లండ్​తో సిరీస్​లో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి!
author img

By

Published : Jan 20, 2021, 8:22 PM IST

Updated : Jan 20, 2021, 9:36 PM IST

టీమ్​ఇండియా వచ్చే నెల 5 నుంచి​ ఇంగ్లాండ్​తో నాలుగు టెస్టుల సిరీస్​ ఆడనుంది. మ్యాచ్​లను చూసేందుకు​ స్టేడియాల్లోకి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, మిగతా రెండు అహ్మదాబాద్​లో జరగనున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆ దేశ బోర్డు అనుభవాలను బీసీసీఐ అడిగి తెలుసుకోనుంది.

"త్వరలో ఇంగ్లాండ్​తో టెస్టు​ సిరీస్​కు 50 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించాం. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లు, ఆరోగ్య అధికారులతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. తగిన జాగ్రత్తలతో అందుకు అంగీకారం లభిస్తే.. తదుపరి ఐపీఎల్​కు కూడా ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యానికి బీసీసీఐ అధిక ప్రాధాన్యమిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెన్నై, అహ్మదాబాద్​లలో కేసులు పెరిగితే తదనుగుణంగా మార్పులు చేస్తామని వెల్లడించాయి. లక్ష మంది సామర్థ్యం ఉన్న మోతేరా స్టేడియంలో.. భౌతిక దూరం పాటిస్తూ, ప్రేక్షకులకు సీట్లను కేటాయించడం పెద్ద సమస్య కాదని పేర్కొన్నాయి. మరోవైపు భారత్​తో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్​​ క్రికెట్​ బోర్డు జట్టును ప్రకటించింది.

ఇదీ చదవండి: 'గట్టిగా పోరాడం.. అత్యుత్తమంగా ఆడాం కానీ..'

Last Updated : Jan 20, 2021, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.