ETV Bharat / sports

దేశవాళీ సీజన్​ ప్రారంభానికి అంతా సిద్ధం? - cricket news

ఈ ఏడాది దేశవాళీ టోర్నీలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే తాత్మాలికంగా తేదీలను నిర్ణయించింది. అయితే, ఐపీఎల్​లో ఆడే భారత ఆటగాళ్లు క్వారంటైన్​ ప్రోటోకాల్స్ కారణంగా లీగ్​ దశ మ్యాచ్​లను కోల్పోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

domestic season
దేశవాళీ సీజన్
author img

By

Published : Aug 10, 2020, 6:09 AM IST

సయ్యద్​ ముస్తాక్​ అలీ టీ20 టోర్నమెంటుతో దేశవాళీ సీజన్​ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. నవంబరు 19న ఈ టోర్నీ నిర్వహించేలా తాత్కాలిక తేదీలను వెల్లడించింది. అయితే, ఐపీఎల్​ జట్లలోని భారత ఆటగాళ్లు క్వారంటైన్​ నిబంధనల కారణంగా లీగ్​ దశ మ్యాచ్​లకు హాజరు కాలేరని అధికారులు పేర్కొన్నారు.

కరోనా కారణంగా దేశవాళీ సీజన్​ నిర్వహణలో ఆలస్యమైంది. ఫలితంగా ఈ ఏడాది కేవలం ముస్తాక్​ అలీ, రంజీ ట్రోఫీలు(డిసెంబరు13-మార్చి10)మాత్రమే నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 38 జట్లు 245 మ్యాచ్​లు ఆడనున్నాయి. అయితే విజయ్ హజారే, దులీప్ ట్రోఫీలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఇరానీ కప్​పైనా సందిగ్ధత నెలకొన్నట్లు వెల్లడించారు.

"ఇది తాత్కాలిక షెడ్యూల్. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, వైస్ ప్రెసిడెంట్​ జై షా ఆమోదం లభించాల్సి ఉంది. అయితే, ఐపీఎల్​ జట్టులో ఉండి అవకాశాలు రాని ఆటగాళ్లతో ఇక్కడ ఒక సమస్య ఉంది. ఎవరైతే టీమ్​లో ఉంటారో వారు ఆడాలని కోరుకుంటారు. అయితే, ప్లే ఆఫ్స్​కు ముందే జట్టు లీగ్​ నుంచి వైదొలిగినప్పటికీ.. వారిని దేశవాళీ క్రికెట్​లో నవంబరు 3కు ముందు అనుమతించరు. కచ్చితంగా 14 రోజులపాటు క్వారంటైన్​లో ఉండాల్సిందే. ఈ క్రమంలోనే వారు దేశవాళీ లీగ్​ దశ మ్యాచ్​లను కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి, నాకు తెలిసి టోర్నీ నిర్వహణలో మార్పులు జరగవచ్చు."

-బీసీసీఐ అధికారి

వచ్చే ఏడాది ఐపీఎల్​ను మార్చి చివర్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే రంజీ ఫైనల్- ఐపీఎల్​ ప్రారంభానికి మధ్య మూడు వారాల వ్యవధి ఇవ్వడం అత్యవసరమని యోచిస్తోంది. ఫలితంగా ఆటగాళ్లకు కాస్త విరామం దొరుకుతంది. మరోవైపు రంజీ ట్రోఫీని జోనల్​ ఫార్మాట్​లో నిర్వహించనున్నట్లు వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ.. అవన్నీ అవాస్తవమని అధికారులు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.